Amazon India Investment: 2030 నాటికి అమెజాన్ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:31 AM
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌లో అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా పెట్టుబడులు గుమ్మరిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే...
10 లక్షల ఉద్యోగాల కల్పనకు దోహదం
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌లో అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా పెట్టుబడులు గుమ్మరిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే భారీ పెట్టుబడులను ప్రకటించగా.. తాజాగా అమెజాన్ కూడా వీటి సరసన చేరింది. భారత మార్కెట్లో క్విక్ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపారాల విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో మరో 3,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.15 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ బుధవారం ప్రకటించింది.
వచ్చే ఐదేళ్లలో 8,000 కోట్ల డాలర్లకు ఎగుమతులు: ఈ పెట్టుబడులు వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాల కల్పనకు దోహదపడగలవని ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్‌లో పేర్కొంది. భారత్ నుంచి కంపెనీ ఎగుమతులను ప్రస్తుత 2,000 కోట్ల డాలర్ల స్థాయి నుంచి 8,000 కోట్ల డాలర్లకు పెంచేందుకు, 15 లక్షల మంది చిన్న వ్యాపారులు, కోట్లాది దుకాణాలకు ఏఐ ప్రయోజనాలు అందించేందుకు, 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ శిక్షణ అందించేందుకు ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయంటోంది.
ఇప్పటికే 4,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు : భార త మార్కెట్లో అమెజాన్ 2010 నుంచి ఇప్పటి వరకు 4,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. 2023లో 2,600 కోట్ల డాలర్ల పెట్టుబడులను ప్రకటించింది. కీస్టోన్ రిపోర్టు ప్రకారం.. భారత్‌లో అమెజానే అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు అని కంపెనీ వర్ధమాన మార్కెట్ల అధిపతి అమిత్ అగర్వాల్ అన్నారు.
దిగ్గజ త్రయం ఇన్వె్‌స్టమెంట్లు
6,750 కోట్ల డాలర్లు
అమెజాన్‌తోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రకటించిన మొత్తం పెట్టుబడులు 6,750 కోట్ల డాలర్లకు చేరాయి. మైక్రోసాఫ్ట్ మంగళవారం 1,750 కోట్ల డాలర్లు (రూ.1.58 లక్షల కోట్లు), విశాఖపట్నంలో ఒక గిగావాట్ సామర్థ్యంతో ప్రపంచస్థాయి ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కోసం 1,500 కోట్ల డాలర్లు (రూ.87,520 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ ఈ అక్టోబరు 14న ప్రకటించింది. అమెరికా వెలుపల గూగుల్‌కు ఇదే అతిపెద్ద పెట్టుబడి.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News