Dalapathi Vijay: అభిమానుల అత్యుత్సాహం.. కింద పడిపోయిన దళపతి
ABN , Publish Date - Dec 29 , 2025 | 08:13 AM
తమిళ స్టార్ విజయ్ అభిమానుల మధ్య కారు ఎక్కబోతూ కింద పడిపోయారు. అయితే.. భద్రతా సిబ్బంది తక్షణమే అప్రమత్తం కావడంతో క్షేమంగా బయటపడ్డారాయన. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళ హీరో దళపతి విజయ్ తన 'జన నాయగన్(Jana Nayagan)' సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం కోసం మలేషియా వెళ్లి ఆదివారం చెన్నైకి తిరిగొచ్చాడు(Jana Nayagan Event In Malaysia). ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున రావడంతో ఎయిర్‌పోర్టులో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో కారు ఎక్కబోతూ కాలు స్లిప్ అయి కింద పడిపోయారు విజయ్(Vijay). దీంతో విమానాశ్రయ ప్రాంగణమంతా ఒక్కసారిగా క్షణకాలం ఆందోళనకు గురయ్యారు. దాదాపు తొక్కిసలాట జరుగుతుందనేంత భయానక వాతావరణం నెలకొంది. అయితే.. ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. తమ హీరో క్షేమంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
అభిమానుల్లో అసంతృప్తి..
ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మలేషియాలో(Malaysia) వేలాదిమంది అభిమానుల నడుమ ఎంతో పకడ్బందీగా ఈవెంట్‌ను నిర్వహించినప్పుడు.. చెన్నై విమానాశ్రయం(Chennai Airport) వద్ద సరైన భద్రత కల్పించలేకపోయారంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయ్ భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని, ఏ కార్యక్రమమైనా ఆయనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
తమిళ రాష్ట్రంలో దళపతికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. అయితే.. జన నాయగన్ మూవీయే తనకు చివరిదని విజయ్ ప్రకటించడంతో అభిమానుల్లో హైప్ క్రియేట్ అయింది. మలేషియాలోని ఓవెన్ స్టేడియంలో(Oven Stadium in Kuala Lumpur) నిర్వహించిన ఆడియో లాంచ్ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఎప్పుడూ భావోద్వేగ ప్రసంగాలతో ఆకట్టుకునే విజయ్.. ఈసారి స్టేజీపై డ్యాన్స్ చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన హీరో ఆఖరి సినిమా కావడంతో.. మధుర జ్ఞాపకాలను మిగల్చడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను పోటు ఎంత