Share News

Assembly Elections: కూటమి నిర్ణయాధికారం విజయ్‌దే..

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:33 PM

సార్వత్రిక ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ రాష్ట్రంలో రాజకీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలా... లేక కూటమిలో చేరాలా అన్నదానిపై నిర్ణయాధికారం విజయ్‌దేనని టీవీకే పార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు టీవీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Assembly Elections: కూటమి నిర్ణయాధికారం విజయ్‌దే..

- టీవీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం

చెన్నై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూటమి ఏర్పాటుపై నిర్ణయాధికారం పార్టీ అధ్యక్షుడు విజయ్‌(Vijay)కు అప్పగిస్తూ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) జిల్లా కార్యదర్శుల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కరూర్‌ దుర్ఘటనానంతరం విజయ్‌(Vijay) మళ్లీ ప్రచారం కోసం ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన ఈరోడ్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ నేతృత్వంలో గురువారం జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది.


nani2.jpg

ఈ సమావేశం నాలుగు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభ ఎన్నికల్లో(Assembly Elections) కూటమి ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకునే అధికారం పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు అప్పగించింది. అదే విధంగా డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపి ‘సరికొత్త తమిళనాడు’ ఏర్పాటు చేయడం, కూటమి ఏర్పాటుపై చర్చలు, పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు,


కమిటీల్లో చోటుచేసుకునే సభ్యుల ఎంపిక అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు విజయ్‌కే కట్టబెట్టింది. అదే సమయంలో, జిల్లా కార్యదర్శులు, బూత్‌ కమిటీలు ప్రజలతో తరచూ సమావేశమవుతూ వారిని చైతన్యవంతం చేసి ఓట్లు పొందేలా కృషిచేయాలని ఆనంద్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నేతలు ఆదర్వ అర్జున, నాంజిత్‌ సంపత్‌, సెంగోట్టయన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2025 | 12:33 PM