Home » CBI
‘మరో 30 నిమిషాల్లో నిన్ను అరెస్ట్ చేస్తారు. ఓ విషయం తెలుసా..? ఇది దేశద్రోహం కేసు. ఒక్కసారి లోపలికెళ్తే బెయిల్ కూడా రాదు’ అంటూ ఆమెను బెదిరించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హైప్రొఫైల్ కేసును పర్యవేక్షించే బాధ్యతలను సీబీఐ సీనియర్ ఆఫీసర్ సీమా పాహుజాకు అప్పగించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' సైబర్ నేరాలపై CBI ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ చక్ర-VI'లో భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టి ముగ్గుర్ని అరెస్ట్ చేసింది.
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ ఇచ్చిన నివేదిక తర్వాతే... తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈఓ మేండు లోకనాథంపై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ శాఖ డీడీఎంఎస్ శివశంకర్ లంచం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారంతో యూనియన్ బ్యాంక్ నుంచి రూ.24 కోట్లను నిందితులు కొట్టేశారు.
గనుల శాఖలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించే ఉన్నతాధికారి.. ఒక క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో యజమానులకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అరెస్టు చేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వాసవి గ్రానైట్ క్వారీలో ఈ ఏడాది జూన్ 25న ప్రమాదం జరిగింది.
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ వెనుక 'యాష్ యాదవ్' కీలక పాత్ర పోషించినట్లు సీబీఐకి ఆధారాలు లభ్యమయ్యాయి.
లంచం మొత్తం కేవలం రూ.4 వేలు. కానీ, ఆ ఆరోపణలపై కేసు నమోదు చేసేందుకు సీబీఐకి ఏకంగా 9 నెలల సమయం పట్టింది! తెలంగాణలో సీబీఐకి ‘జనరల్ కన్సెంట్’ (సాధారణ అనుమతి)లేకపోవడం వల్ల కేసుల నమోదు ప్రక్రియ ఎంత ఆలస్యమవుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ ఎస్‌ఎస్ వీవీ నాగరాజు రెండో రోజు విచారణలోనూ మౌనం పాటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన సమాధానమివ్వలేదు.