IRCTC Scam: లాలూ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసు
ABN , Publish Date - Jan 05 , 2026 | 07:07 PM
లాలూ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ హాజరుకాగా, సీబీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ డీపీ సింగ్ హాజరయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ పని చేసిన సమంయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణకు కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది.
న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ కుంభకోణం (IRCTC Scam) కేసులో తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సోమవారంనాడు విచారణ జరిపింది. కేసు దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. లాలూ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని సీబీఐ (CBI)కి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి జస్టిస్ స్వరణ కాంత శర్మ వాయిదా వేశారు.
లాలూ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ హాజరుకాగా, సీబీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ డీపీ సింగ్ హాజరయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ పని చేసిన సమయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణకు కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది. కాంట్రాక్టులకు ప్రతిగా లాలూ ప్రసాద్ బినామా కంపెనీ ద్వారా భూములు పొందారని చెబుతోంది. ఈ ఆరోపణల కింద లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్, మరో పది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద ట్రయిల్ కోర్టు ఈ అభియోగాలు మోపింది. ట్రయిల్ కోర్టు 2025 అక్టోబర్ 13న ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టులో లాలూ యాదవ్ సవాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
సముద్ర ప్రతాప్ నౌక జలప్రవేశం.. ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి