Home » Delhi High Court
యాప్ ఆధారిత క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలు అందించే ఓలా, ఉబర్, రాపిడోలకు మహిళల భద్రతకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు నోటీలసులు జారీ చేసింది.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) లీడర్లు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, రత్న సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ సత్య నికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంపై MCD ఉన్నతాధికారుల స్థాయిలోనే విచారణ జరిపించాలని ఆదేశించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయా? బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాత ఎయిర్‌పోర్టులో వాణిజ్య విమానాల నిలిపివేతపై దాఖలైన పిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు లభించిన వ్యవహారంపై పార్లమెంటరీ విచారణ కమిటీ కీలక విషయాలు వెల్లడించింది. ఆయన ఇంట్లో లభించిన నగదుకు సంబంధించి తగిన వివరణ ఇవ్వడంలో వర్మ విఫలమయ్యారని కమిటీ పేర్కొంది.
లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులు, గోప్యతకు భంగం కలిగించవద్దని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువీ ఫొటోలను ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది.
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతోనే కేంద్ర ప్రభుత్వం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని, ఇది సరైన నిర్ణయమేనని పేర్కొంది.
ప్రముఖ శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్స నెపంతో తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె పిటిషన్ వేశారు.