National Herald Case: ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు
ABN , Publish Date - Dec 22 , 2025 | 03:15 PM
ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని, సాక్ష్యాలను సేకరించిందని, కేసులో భాగంగా పలుచోట్ల సోదాలు కూడా జరిపిందని చెప్పారు.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ (National Herald)కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ ఛార్జిషీటుపై ట్రయిల్ కోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను దర్యాప్తు సంస్థ (ED) హైకోర్టు (High Court)లో సోమవారంనాడు సవాలు చేసింది. దీంతో కేసులో నిందితులైన కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని, సాక్ష్యాలను సేకరించిందని, కేసులో భాగంగా పలుచోట్ల సోదాలు కూడా జరిపిందని చెప్పారు. ఈడీ ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకోకుండా దిగువ కోర్టు తప్పు చేసిందని ఆయన వాదించారు. ఈ కేసుపై తదుపరి విచారణను 2026 మార్చి 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు గత మంగళవారంనాడు నిరాకరించింది. చార్జిషీటును తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా, ప్రైవేటు వక్తి సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా చార్జిషీటును పరిగణనలోకి తీసుకోలేమని ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే తప్పుపట్టారు. చట్టం ప్రకారం దీన్ని విచారించడం సాధ్యం కాదన్నారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ప్రత్యేక న్యాయమూర్తి గుర్తుచేశారు. అలాంటప్పుడు ఈడీ చార్జిషీటు ఆధారంగా తీర్పు ఇవ్వడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేసులో ఈడీ దర్యాప్తును కొనసాగించవచ్చని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈడీ ఛార్జిషీట్లులో సోనియగాంధీ, రాహుల్ గాంధీ పేర్లతో పాటు సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారి పేర్లు చేర్చింది.
ఇవి కూడా చదవండి..
'శాంతి' బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి