Home » Sonia Gandhi
నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పులు తీర్చే క్రమంలో నగదు అక్రమ చలామణికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై ఈడీ నమోదు చేసిన కేసుపై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తొంభై కోట్ల రూపాయల అప్పును సాకుగా చూపి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కుట్రపన్నారని ఈడీ ఆరోపించింది.
స్వాతంత్య్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ.. తన భావాలను ప్రతిబింబించే విధంగా ఒక పత్రికను ప్రారంభించాలని భావించింది. ఈ ఉద్దేశ్యంతో 1938లో ది నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహర్ లాల్ నెహ్రు ప్రారంభించారు. దీనికి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ప్రచురణకర్తగా వ్యవహరించింది.
ఇరాన్, గాజాలపై ఇజ్రాయెల్ విధ్వంసక దాడుల విషయంలో కేంద్రం మౌనం వహించిందంటూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ మండిపడ్డారు.
ఇజ్రాయెల్‌తో పాటు స్వతంత్ర పాలిస్తీనాతో రెండుదేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి భారత్ చిరకాలంగా కట్టుబడి ఉందని, దానికి కేంద్రం దూరమైనట్టు కనిపిస్తోందని సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం ఆదివారం రాత్రి క్షీణించింది. ఆ తర్వాత ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో (Sonia Gandhi Hospitalised) చేర్చారు. అక్కడ వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని హిమాచల్ ప్రదేస్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రిన్సిపల్ అడ్వైజర్ (మీడియా) నరేష్ చౌహాన్ ధ్రువీకరించారు. స్వల్ప ఆరోగ్య సమస్యలతో రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆమె ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో తల్లీ తనయులిద్దరూ రూ.142 కోట్లు లబ్ధి పొందారని బుధవారం నాడు ఢిల్లీ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేయాలని ఈడీ చేసిన విజ్ఞప్తిపై ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ జరిపారు. సవరించిన చట్టంలోని నిబంధల ప్రకారం ఎలాంటి జాప్యం లేకుండానే నోటీసులు జారీ చేయాలని కోర్టును ఈడీ కోరింది.
కాంగ్రెస్ అధినాయకత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని, బీజేపీ అక్రమంగా కేసులు పెడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పేర్లను అక్రమంగా ఛార్జిషీట్లో చేర్చడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.