AICC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ప్రారంభం
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:06 PM
ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 27: న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఇవాళ (శనివారం) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి హాజరైన ఇతర కాంగ్రెస్ ప్రముఖుల్లో.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నేత హరీష్ రావత్, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఎంపీ శశి థరూర్ ఇతరులు ఉన్నారు. చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ ఈ సమావేశానికి గైర్హాజరు కావడం విశేషం.
ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు (డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఆహ్వానం లేకపోవడం), శశి థరూర్ ఇటీవలి కాంగ్రెస్ కార్యక్రమాలకు గైర్హాజరు కావడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. అజెండా వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. బీజేపీ నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News