Home » AICC
ఢిల్లీలోని సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగబోతోన్న తరుణంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలు చర్చించారు.
ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
తెలంగాణ డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ, 22 మంది సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించి, రాష్ట్రానికి పంపించింది. ఈ రోజు నుంచి వీరంతా తెలంగాణలోని 35 జిల్లాల్లో పర్యటిస్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా అని మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు.
ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల సమావేశం ఆదివారం నాడు గాంధీభవన్‌లో జరిగింది. ఇన్‌చార్జ్ మీనాక్షికి కార్పొరేషన్ చైర్మన్లు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. జిల్లాల్లో ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను కలుపుకుపోవడం లేదని ఫిర్యాదు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ శుభావార్త తెలిపింది. టీపీసీసీలో పలు కమిటీలను గురువారం ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
కీలకమైన అంశలపై చర్చించడంతో పాటు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటుంటున్న సమస్యల పరిష్కారానికి, దేశానికి పటిష్టమైన ప్రత్నామ్నాయ విజన్‌ను ఆవిష్కరించేందుకు ఏఐసీసీ సెషన్ ఒక వేదక కానుందని ఏఐసీసీ ఇన్‌చార్జి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ తెలిపారు.
CM Revanth Reddy: ఉగ్రదాడికి నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాడు హైదరాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు నేతలు నివాళి అర్పించనున్నారు.