Share News

Priyanka Gandhi: అస్సామ్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రియాంక గాంధీ

ABN , Publish Date - Jan 04 , 2026 | 03:21 PM

అస్సామ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో విజయంపై కన్నేసిన హస్తం పార్టీ.. ఆ ప్రణాళికల్లో భాగంగా స్క్రీనింగ్ బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించింది.

Priyanka Gandhi: అస్సామ్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రియాంక గాంధీ
Priyanka Gandhi

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సామ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించింది(Assam Screening Committee Chairperson Priyanka Gandhi). దీంతో ఆమె.. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించే స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ప్రియాంకకు లభించిన తొలి సంస్థాగత బాధ్యత ఇదే కావడం విశేషం. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్(AICC Chief Secretary KC Venu Goal) ఉత్తర్వులు జారీచేశారు. ప్రియాంక కమిటీలో లోక్‌సభ సభ్యులు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్, సిరివెల్ల ప్రసాద్‌లు మెంబర్స్‌గా ఉన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపులు వంటి వాటిని ఈ కమిటీ నిర్వహించనుంది.


అస్సామ్‌తో పాటు 2026లో ఎన్నికలు జరగనున్న మరో మూడు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికీ ఛైర్మన్లను నియమించింది ఏఐసీసీ. అందులో భాగంగా పశ్చిమ్ బెంగాల్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత బీకే.హరిప్రసాద్‌కు(BK Hari Prasad) బాధ్యతలు అప్పగించింది. ఇక.. కేరళ బాధ్యతలను రాజ్యసభ మాజీ సభ్యులు మధుసూదన్ మిస్త్రీకి(Madhusudhan Mistry); తమిళనాడు, పుదుచ్చేరిలకు ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి త్రిభునేశ్వర్ సారన్ సింగ్ దేవ్‌లకు(TS Singh Deo) అప్పగిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.


అస్సామ్‌లో గత ఎన్నికల్లో(Assam Elections) కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో కొత్త ఎత్తుగడలో భాగంగా ఆ రాష్ట్రంలో జయకేతనం ఎగురవేసే దిశగా ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానం. ఆ రాష్ట్రంలో మొత్తం 126 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీయే(NDA) కూటమి. అయితే.. ఎన్డీయే కూటమికి పోటీగా కాంగ్రెస్(Congress పార్టీ.. ఏఐయూడీఎఫ్(AIUDF) వంటి ప్రాంతీయ పార్టీలతో కలసి బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీకి స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇవీ చదవండి:

క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

Updated Date - Jan 04 , 2026 | 03:21 PM