Fire Erupts at Thrissur RS: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకులు దగ్ధం
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:51 PM
కేరళలోని త్రిసూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వందలాది బైకులు కాలి బూడిదయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: కేరళలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది(Massive Fire explosion at Kerala). త్రిసూర్ రైల్వే స్టేషన్(Trissur Railway Station) ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో పార్కింగ్ ఏరియాలో ఉన్న వందలాది బైకులు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో ఆ పెయిడ్ పార్కింగ్ షెడ్‌లో సుమారు 600కు పైగా మోటార్ సైకిళ్లు ఉన్నట్టు సమాచారం(Motorbikes Gutted).
ఓ విద్యుత్ తీగ బైక్‌లకు తగలడంతో ప్రమాదం చెలరేగిందని ప్రాథమికంగా నిర్ధారణ అవుతోంది. తొలుత రెండు మోటార్ సైకిళ్లలో ఈ మంటలు చెలరేగి.. ఆ తర్వాత వేగంగా పార్కింగ్ ప్రాంతమంతా వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న సుమారు 500కి పైగా బైకులు కాలి బూడిదైనట్టు సమాచారం. ఈ ఘటనలో పార్కింగ్ షెడ్ సహా రైల్వే స్టేషన్ రెండో గేటు వద్దనున్న టికెట్ కౌంటర్, ఆగి ఉన్న ఓ తనిఖీ వాహనం దగ్ధమయ్యాయి. అయితే.. అక్కడి వారు వెంటనే అప్రమత్తమై పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టమూ వాటిల్లలేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు(Fire Officials).. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విచారణ చేపట్టినట్టు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కే.రాజన్(Kerala Revenue Minister Rajan) వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించి.. వెంటనే నివేదిక సమర్పించాలని త్రిసూర్ నగర పోలీస్ కమిషనర్‌ను కోరినట్టు ఆయన చెప్పారు.
ఇవీ చదవండి: