Share News

Electric Geyser: ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:19 PM

శీతాకాలం కావడంతో సాధారణంగా గీజర్ల వాడకం పెరిగిపోయింది. అయితే.. వీటిని ఉపయోగించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాడిపత్రిలో ఇటీవల జరిగిన గ్యాస్ గీజర్ పేలుడు ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

Electric Geyser: ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!
Electric Geyser

ఇంటర్నెట్ డెస్క్: చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇళ్లలో ఎలక్ట్రిక్ గీజర్లను(Electric Geyser) వాడుతుంటారు. ఇవి మనకు వేడి నీటిని అందిస్తున్నప్పటికీ.. వీటి నుంచి ముప్పు వాటిల్లే అవకాశాలూ ఎక్కువే. గతంలో ఢిల్లీలో ఓ మహిళ విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఏపీలోని తాడిపత్రిలో గ్యాస్ గీజర్ పేలడంతో సుమారు 8 మంది గాయపడ్డారు. ఇలా గీజర్లను ఉపయోగించడం తెలియక చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గీజర్ల వాడకంపై తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీకోసం...


  • ఎలక్ట్రిక్ గీజర్లలో ఎలాంటి లీకేజీ లేకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా చాలా మంది చిన్న లీకేజే కదా అని నిర్లక్ష్యం తీసుకుంటారు. ఇది పేలుడుకు దారితీసే అవకాశముంది.

  • గీజర్ పేలడానికి మరో కారణం అధిక పీడనం. గీజర్ థర్మోస్టాట్ సెన్సార్ పనిచేయకపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవిస్తుంది. నీరు వేడికావడం నిర్ణీత ఉష్ణోగ్రతకు చేరాక.. ఈ సెన్సార్ గీజర్‌కు విద్యుత్‌ను నిలిపేస్తుంది. ఈ సంకేతంతో పవర్ ఆఫ్ చేయాలి.

  • చాలా మంది రాత్రంతా గీజర్లను ఆన్‌లో ఉంచుతారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల నీరు చాలా వేడిగా మారుతుంది. దీనివల్ల పీడనం ఎక్కువై.. గీజర్ పేలిపోయే ఛాన్స్ ఉంది.

  • గీజర్లో నీరు లేనప్పుడు దానిని ఆన్ చేయవద్దు. ఇది గీజర్ వేగంగా పనిచేయకపోవడానికి దారితీస్తుంది. దీని వల్ల పెద్ద ప్రమాదానికీ దారితీయవచ్చు.

  • గీజర్లలో అమర్చిన ప్రెజర్ వాల్వ్‌ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి. లేదంటే ఈ వాల్వ్ దెబ్బతినడం వల్ల పీడనం ఎక్కువై గీజర్ పేలుడుకు కారణమవుతుంది.


ముఖ్యంగా.. గీజర్‌ పేలడానికి ముంది దాని నుంచి నీరు లీకవడం ప్రారంభమవుతుంది. ఈ సంకేతంతో అప్రమత్తమై గీజర్‌ను వెంటనే సర్వీస్ చేయించాలి. గీజర్ అకస్మాత్తుగా తుప్పుపట్టినా, గోధుమ రంగు నీరు లీకైనా.. అప్రమత్తమవ్వాలి. ట్యాంక్ దెబ్బతిన్నాయనేందుకు ఇవి ప్రధాన సంకేతాలు. క్రమం తప్పకుండా సరైన టెక్నీషియన్ ద్వారా గీజర్‌ను సర్వీసింగ్ చేయించుకోవాలి.

గీజర్ పగిలిపోయేటట్టు ఏవైనా సంకేతాలు కనిపిస్తే.. వెంటనే దాని సంబంధిత స్విచ్‌ను ఆఫ్ చేయాలి. ఒకవేళ అది గ్యాస్ కనెక్టెడ్ అయితే.. గ్యాస్ సరఫరా నిలిపివేయాలి. ఆ తర్వాత.. వెంటనే ప్రొఫెషనల్ మెకానిక్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం వహిస్తే.. ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

గీజర్లకు వెంటిలేషన్ చాలా ముఖ్యం. కాబట్టి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. స్నానం చేసేటప్పుడు గీజర్‌ను ఎప్పుడూ ఆఫ్ చేసి ఉంచండి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆన్‌ చేయడం మరవద్దు.


ఇవీ చదవండి:

ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. భారీ అనకొండ తలపై పాప్ సింగర్ డ్యాన్స్..

అత్యంత అందమైన నేరస్థుడు.. 24 ఏళ్ల జైలు శిక్ష.. సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాడంటే..

Updated Date - Jan 04 , 2026 | 03:15 PM