Jolin Tsai viral video: ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. భారీ అనకొండ తలపై పాప్ సింగర్ డ్యాన్స్..
ABN , Publish Date - Jan 04 , 2026 | 10:48 AM
తైవాన్ పాప్ స్టార్ జోలిన్ సాయ్ తన తాజా ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 30 మీటర్ల పొడవైన అనకొండ తలపై నిలబడి ప్రమాదకరమైన ప్రదర్శన ఇచ్చింది. కదులుతున్న అనకొండ తలపై నిలబడి ఆమె పాటలు పాడుతూ, డ్యాన్స్ చేసింది.
తైవాన్ పాప్ స్టార్ జోలిన్ సాయ్ తన తాజా ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 30 మీటర్ల పొడవైన అనకొండ తలపై నిలబడి ప్రమాదకర ప్రదర్శన ఇచ్చింది. కదులుతున్న అనకొండ తలపై నిలబడి ఆమె పాటలు పాడుతూ, డ్యాన్స్ చేసింది. ఈ అద్భుతమైన దృశ్యం అభిమానులను ఉత్తేజపరిచింది. నమ్మశక్యం కాని ఈ విన్యాసం అక్కడున్న వారిని ఉత్తేజపరిచింది (Taiwanese star Jolin Tsai dance).
డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలలో మూడ్రోజుల పాటు తైపీలో జరిగిన తన ప్లెజర్ వరల్డ్ టూర్ సందర్భంగా జోలిన్ సాయ్ ఈ డ్యాన్స్ చేసింది. తైవాన్‌కు చెందిన పాప్ సింగర్ జోలిన్ సాయ్ ఆసియాలో అత్యంత సాహసోపేతమైన ప్రత్యక్ష ప్రదర్శనకారులలో ఒకరిగా ప్రసిద్ధి చెందింది. తాజాగా ఆమె తన సాహసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. 30 మీటర్ల పొడవైన పాము ఆకారంలో ఉన్న స్టేజ్‌పై నిలబడి ఆమె పాటలు పాడుతూ, డ్యాన్స్ చేసింది. నిజానికి అది పాము కాదు.. పాము లాంటి ఆకారంలో నిర్మించిన వేదిక (giant anaconda snake video).
అది నిజమైన పాము కాకపోయినప్పటికీ.. ఆడిటోరియంలో అంత ఎత్తున కదులుతున్న వేదికపై డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు (30 meter anaconda dance). కదులుతున్న పాముపై ఆమె పూర్తి కాన్ఫిడెన్స్‌తో డ్యాన్స్ చేసింది. అందుకే ఈ అద్భుతమైన దృశ్యం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అందరినీ షాక్ అయ్యేలా చేసింది. రోజుకు 40 వేల మంది చొప్పున, మూడ్రోజుల్లో మొత్తం 1.20 లక్షల మంది ఆ ప్రదర్శనను వీక్షించారు. ఆ ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియా జనాలు షాకవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
న్యూయార్క్‌కు చేరుకున్న వెనుజువెలా అధ్యక్షుడు..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..