Mahesh Goud Key Meeting with CM Revanth: సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ గౌడ్ అత్యవసర భేటీ.. ఎందుకంటే
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:01 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఇవాళ(శనివారం) మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud). ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌ను అభినందించారు సీఎం రేవంత్‌రెడ్డి.
మరోవైపు.. ఈ నెల(సెప్టెంబరు) 8వ తేదీన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్‌లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో ఆర్డినేటర్లు, జిల్లా కమిటీ కోసం వేసిన కో ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు, జై బాపు జై భీమ్, జై సంవిధాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు ఫైర్
రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం
Read Latest Telangana News and National News