Home » Mahesh Kumar Goud
ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పట్టిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్‌లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
లావాదేవీలలో భాగంగానే కవిత - బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. కవిత కారణంగా బీఆర్ఎస్ కబ్జాలు అన్ని బయటకు వస్తున్నాయని విమర్శించారు.
బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఇప్పుడు దీక్షా దివాస్ పేరుతో మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని పేర్కొన్నారు.
సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి.. కేబినెట్‌లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సుదీర్ఘ కాలం అజారుద్దీన్ దేశానికి సేవలు అందించిన వ్యక్తి అని కొనియాడారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి టూర్ షెడ్యూల్ ఖరారైంది.
హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.