Share News

ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: మహేశ్‌ గౌడ్

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:30 PM

ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ అన్నారు. కేటీఆర్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: మహేశ్‌ గౌడ్
Mahesh Kumar Goud

హైదరాబాద్, జనవరి 23: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(Former Minister KTR) టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ తనపై వ్యక్తిగత హననం చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. రాజ్యాంగం ప్రకారమే విచారణ జరుగుతోందని.. రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఉంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకునేవాళ్లమని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.


బీఆర్‌ఎస్‌పై విమర్శలు..

ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే అని పీసీసీ చీఫ్ తెలిపారు. కేటీఆర్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వ్యాఖ్యానించారు. ‘బట్ట కాల్చి మీద వేసి పారిపోతామంటే కుదరదు. అలీ బాబా 420 దొంగల మాదిరి కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. స్టువర్ట్‌పురం దొంగల బ్యాచ్ బీఆర్‌ఎస్’ అని తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దీపం ఆగిపోకుండా ‘ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం’ అంటూ కేటీఆర్ రాగాలు తీస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.


ఉద్యమ కేసులతో పోల్చొద్దు..

ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని, తోడబుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే సమాధానం లేదని మహశ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రమైందని, దీన్ని ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదని మహేశ్ గౌడ్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ హయంలో కేవలం మూడు నెలల్లో 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయని, తన మిత్రుడి ఫోన్ కూడా ట్యాప్ అయిందని వెల్లడించారు.


కవిత ఎపిసోడ్‌పై స్పందిస్తూ..

‘కవితను చెల్లెలుగా ఎప్పుడూ గౌరవిస్తా. కేసీఆర్ కుటుంబంలో తగాదాలకు మూలం వాటాల పంపకంలో తేడా. కవిత ఇప్పటికైనా నిజాలు మాట్లాడుతున్నందుకు స్వాగతిస్తున్నాం’ అని చెప్పారు. అలాగే ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మార్పు ఉండదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

సిట్ ముందుకు కేటీఆర్.. ఆ విషయాలపైనే విచారణ

ట్యాపింగ్ పేరుతో రాజకీయ క్రీడ.. రేవంత్‌పై ప్రవీణ్ తీవ్ర విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 04:39 PM