Share News

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ గౌడ్

ABN , Publish Date - Jan 26 , 2026 | 09:35 PM

ఫోన్ ట్యాపింగ్‌లో దోషులకు శిక్ష పడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కేసులో అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు..

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ గౌడ్
Mahesh Kumar Goud

ఢిల్లీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్‌లో దోషులకు శిక్ష పడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఈ కేసులో అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఫోన్ ట్యాపింగ్‌ను తీవ్ర నేరంగా పరిగణిస్తున్నానని చెప్పుకొచ్చారు. సోమవారం ఢిల్లీలో మహేశ్ కుమార్ గౌడ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. తాము కూడా సమాచారం ఇచ్చామని, ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైన చర్య అని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరు ఇన్వాల్వ్ అయినా అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్‌లో పరిపూర్ణమైన విచారణ జరగాలని కోరారు.


తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ..

కాంగ్రెస్‌లోకి కవిత వస్తారనే ప్రస్తావన వచ్చినప్పుడు కూడా కవిత తమ పార్టీలోకి అవసరం లేదని చెప్పానని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల నుంచి తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తర్వాత చర్చిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు పరిపాలన అంశం విషయంలో మంత్రులు సమావేశం జరిపితే తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు.


బీఆర్ఎస్ అవకతవకలపై విచారణ జరగాలి..

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ జరగాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. దొంగే దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిచినట్లుగా బీఆర్ఎస్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. కవిత ఈ వ్యవహారంలో నిన్న అన్ని విషయాలు స్పష్టంగా చెప్పారని ప్రస్తావించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు వారి హయంలో కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపణలు చేశారు. హరీశ్‌రావు, కేటీఆర్ కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చాలని చూశారని కవిత స్వయంగా చెప్పిందని గుర్తుచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన

ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 09:45 PM