Home » Thanneeru Harish Rao
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకంట్ల చంద్రశేఖర్రావుని నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో కేటీఆర్, హరీష్రావు చర్చించారు.
కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఎదుట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విచారణకు హాజరయ్యారు. బీఆర్కే భవన్లో మరోసారి పీసీ ఘోష్ కమిషన్ను హరీష్రావు కలిశారు.
మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు లేదా తన భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే రేణుకాకు బిగ్ రిలీఫ్ లభించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా అని మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
బీఆర్ఎస్ హయాంలో బనకచర్లపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని మాజీ మంత్రి హరీష్రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కాకుండా.. రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్రావు ఫైర్ అయ్యారు.
రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని మాజీమంత్రి హరీష్రావు అన్నారు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.
ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన గాంధీ కుటుంబం నిరుద్యోగ యువతి, యువకులకు హామీలు ఇచ్చి దారుణంగా మోసం చేశారని మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. నిరుద్యోగులు వారి సమస్యలపై పోరాడాలని.. వారి న్యాయబద్ధమైన పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని హరీష్రావు మాటిచ్చారు.
కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ చైర్మన్కు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు, ఆధారాలతో సెబీకి గురువారం హరీష్రావు లేఖ రాశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు టీజీఐఐసీ ద్వారా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలను లేఖలో హరీష్రావు ఎండగట్టారు.
సీఎం రేవంత్రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు పోదాం అంటున్నారని.. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని.. తాను సిద్ధమని మాజీ మంత్రి హరీష్రావు ప్రతి సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహించడం చేతగాక రేవంత్రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వారం రోజులకు మించి అసెంబ్లీ నడిపే పరిస్థితి లేదని హరీష్రావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రప్పా రప్పా డైలాగులపై ఆయన స్పందించారు. సినిమా డైలాగులు రాజకీయాల్లో చెల్లవని మల్లు రవి అన్నారు.