హరీశ్‌రావును జైలుకు పంపాలని తహతహలాడుతున్నారు.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:50 PM
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి20(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Kalvakuntla Taraka Rama Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదన్నారు. ఇంకో వెయ్యి సెట్‌లు వేసినా ఎదుర్కోవటానికి రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే రేవంత్ రెడ్డిని వదిలేది లేదని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్‌రావును జైలుకు పంపాలని రేవంత్‌రెడ్డి తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు కంటే రేవంత్‌రెడ్డి సిట్ పెద్దదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. బొగ్గు కుంభకోణంలో సీఎం బావమరిది సృజన్ రెడ్డి కింగ్ పిన్ అని ఆరోపణలు చేశారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బొగ్గు కుంభకోణంలో కిషన్‌రెడ్డికి వాటాలు..
బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కోల్ మినిస్టర్ కిషన్.. ఈ విషయంలో మౌనంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి బావమరిది కుంభకోణం బయట పెట్టినందుకే హరీశ్‌రావును విచారణపేరుతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లొసుగులు బయటపెట్టిన ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వాటాల పంచాయితీ వల్లే నైనీ బ్లాక్ టెండర్లను మల్లు భట్టి విక్రమార్క రద్దు చేశారని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పెద్ద తప్పు అని కేటీఆర్ తెలిపారు. టెండర్లు వేస్తోన్న వారిపై సృజన్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. నైనీ ఒక్కటే రద్దు చేస్తే సరిపోదని.. సృజన్ రెడ్డి దక్కించుకున్న టెండర్లనూ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రేవంత్ కేబినెట్‌ను హరీశ్‌రావు ఫుట్‌బాల్ ఆడుకున్నారని సెటైర్లు వేశారు.
రేవంత్ రెడ్డిది బురద బుద్దే..
అదృష్టం అందలం ఎక్కిస్తే.. రేవంత్‌ది మాత్రం బురద బుద్దినేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నాళ్లు లీకుల మీద బతుకుతారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎందుకు ఒక్క అధికారిక ప్రెస్‌మీట్ పెట్టరని నిలదీశారు. విచారణ పేరుతో బీఆర్ఎస్ నాయకత్వాన్ని రేవంత్ సర్కార్ వేధిస్తోందని విమర్శించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు భూ అరాచకాలపై సిట్ ఎందుకు వేయటం లేదని ఆయన ప్రశ్నించారు. ఏఐసీసీ సెక్రటరీ అలంపూర్‌లో రూ.8 కోట్లు డిమాండ్ చేస్తే.. ఎందుకు సిట్ వేయరు.? అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగస్వామ్యమైన అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని సూచించారు. రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని.. రేవంత్‌రెడ్డి ఆడే రాజకీయ క్రీడలో అధికారులు బలి కావొద్దని హితవు పలికారు.
అధికారులను వదిలేది లేదు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో పాల్గొన్న అధికారులను రిటైర్ అయిన తర్వాత కూడా వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు. కేబినెట్‌లో దండుపాళ్యం బ్యాచ్ ఉందని ఎద్దేవా చేశారు. దందాల నుంచి దృష్టి మరల్చడానికే సిట్ విచారణ పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ జెండా గద్దెలను ముట్టుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. పేమెంట్ కోటాలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. ఇంకా ఆయనను సీఎంగా గుర్తించటం లేదని సెటైర్లు వేశారు. హార్వర్డ్‌లో చదువుకున్న తర్వాతనైనా.. రేవంత్‌రెడ్డి భాషలో మార్పు రావాలని హితవు పలికారు. ఆయనకు ఇంగ్లీష్ రాదని.. హార్వర్డ్‌లో ఏం నేర్చుకుంటారో చూడాలని ఎద్దేవా చేశారు. జనవరి 31 తర్వాత రేవంత్‌లో కొత్త మనిషి.. కొత్త భాష వస్తుందేమో చూద్దామన్నారు కేటీఆర్.
ఇవి కూడా చదవండి...
చట్టాల మీద గౌరవంతోనే సిట్ విచారణకు హరీశ్: న్యాయవాది చంద్రశేఖర్
డైవర్షన్ కోసమే నోటీసులు.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్
Read Latest Telangana News And Telugu News