Phone Tapping Case: చట్టాల మీద గౌరవంతోనే సిట్ విచారణకు హరీశ్: న్యాయవాది చంద్రశేఖర్
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:31 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరవడంపై ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర్ స్పందించారు. రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా హరీశ్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు.
హైదరాబాద్, జనవరి 20: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు(Fomer Minister Harish Rao) సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే.. హరీశ్‌తో పాటు ఉన్న న్యాయవాది చంద్రశేఖర్‌ను లోపలికి అనుమతించేందుకు సిట్ నిరాకరించింది. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా హరీశ్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. రెండేళ్ల క్రితం నమోదైన కేసులో ఉద్దేశ పూర్వకంగానే నోటీసులు జారీ చేసిందని విమర్శించారు.
సిట్ ఇచ్చిన నోటీసులపై కోర్టుకు వెళ్లి క్వాష్ చేసుకునే అవకాశం ఉన్నా.. చట్టాల మీద ఉన్న గౌరవంతో హరీశ్ రావు విచారణకు హాజరయ్యారని చంద్రశేఖర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ పాత్ర లేదని తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టు పిటిషన్లను కొట్టివేశాయన్నారు. సిట్ విచారణ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు విచారణ సమయంలో లాయర్లుగా తమనూ అనుమతించలేదన్నారు. ఎన్నికల ముందు ప్రతిసారీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా డ్రామా ఆడుతోందంటూ దుయ్యబట్టారు. సిట్ నోటీసులకు భయపడేది లేదని.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని న్యాయవాది చెప్పారు.
ఇవి కూడా చదవండి...
డైవర్షన్ కోసమే నోటీసులు.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్
దారుణం... తల్లిపై కొడుకు కత్తితో దాడి
Read Latest Telangana News And Telugu News