కేసీఆర్‌కి సిట్ నోటీసులు.. మహేశ్ గౌడ్ రియాక్షన్..
ABN , Publish Date - Jan 29 , 2026 | 01:41 PM
మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మాజీ సీఎంకు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌కు(KCR) సిట్ నోటీసులపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆనాడు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదని ఆయన చెప్పారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండా అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడరని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు భాగస్వాములో తేలాల్సి ఉందని పేర్కొన్నారు.
పారదర్శక విచారణ జరగాలి..
ఫోన్ ట్యాపింగ్ విషయంలో పారదర్శక విచారణ జరగాలని కోరారు మహేశ్ కుమార్. 500కు పైగా ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేశారనే సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. సిట్ సంపూర్ణ విచారణ జరిగితేనే తెలుస్తుందని.. నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలు వెలుగులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు
హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News