Home » Kalvakuntla Chandrasekhar Rao
తెలంగాణ బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు టీబీజేపీ నేతలు.
కేసీఆర్ అండ్ కోకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అసత్యాలేనని విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్‌ను నాశనం చేసింది కేసీఆరేనని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు.
మాజీమంత్రి కేటీఆర్ అవినీతిలో కూరుకుపోయి ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నట్లుందని చెప్పుకొచ్చారు. కొందరు తన బొమ్మను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడం వల్ల ఎలాంటి లాభం లేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గిచుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రపంచ ప్రఖ్యాత శిల్పకారుడు, పద్మ భూషణ్ రామ్ వంజీ సుతార్ మృతిపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్‌లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు.