Share News

ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసింది.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

ABN , Publish Date - Jan 30 , 2026 | 08:12 PM

బీఆర్ఎస్‌ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు..

ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసింది.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Minister Uttam Kumar Reddy

ఢిల్లీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్‌ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. ఢిల్లీ సీడబ్ల్యూసీ మీటింగ్‌ గురించి మాజీ మంత్రి హరీశ్‌రావు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు. నీటి వాటాలపై చర్చలకు తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల హక్కులను వదులుకునే ప్రస్తక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీ సీడబ్ల్యూసీ మీటింగ్‌‌లో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


పోలవరం- నల్లమల ప్రాజెక్టుపై చర్చకు తెలంగాణ అధికారులు ఒప్పుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. పోలవరం- నల్లమల సాగర్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఈరోజు సమావేశంలో చెప్పారని ప్రస్తావించారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో ఇరిగేషన్‌కు రూ.1.84 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీటి వాటాల పంచాయితీ వల్ల అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల్లో నష్టం జరిగిందని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ జలాల తెలంగాణ ప్రభుత్వం చుక్క నీరు వదలుకోదని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం సర్వశక్తులు ఒడ్డుతూ పోరాటం చేస్తున్నామని వివరించారు. నీటి వాటాల కోసం అన్ని రకాల పోరాటాలు చేస్తున్నామని వెల్లడించారు. పోలవరం - బనకచర్లపై కోర్టులో సూట్ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఈ దొంగతనం చూస్తే విస్తుపోవాల్సిందే.. కేవలం 15 సెకన్లలోనే..

బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ల సంఘం ఫైర్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Jan 30 , 2026 | 08:24 PM