బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ల సంఘం ఫైర్
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:18 PM
ఐపీఎస్ అధికారిపై బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ పేర్కొంది. మతం పేరుతో ఆరోపణలు చేయడం దారుణమని చెప్పుకొచ్చింది.
హైదరాబాద్, జనవరి30 (ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ అధికారిపై బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ (Telangana IPS Officers Association) పేర్కొంది. మతం పేరుతో ఆరోపణలు చేయడం దారుణమని చెప్పుకొచ్చింది. కరీంనగర్ సీపీ గౌశ్ ఆలంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిపై వ్యక్తిగత దాడి చేశారని అసోసియేషన్ మండిపడింది.
మత మార్పిడుల ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ ఘటన సివిల్ సర్వీస్ అధికారుల మనోబలాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపింది. ఎమ్మెల్యే ప్రవర్తనపై తక్షణ విచారణకు డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే నుంచి బహిరంగ క్షమాపణ కోరింది. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి మతమార్పిడికి ప్రయత్నిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తూ.. అతని మతం గురించి చేసిన ఆరోపణలతో తీవ్రంగా కలత చెందుతున్నామని పేర్కొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఈ దొంగతనం చూస్తే విస్తుపోవాల్సిందే.. కేవలం 15 సెకన్లలోనే..
పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్
Read Latest Telangana News And AP News And Telugu News