Share News

కేసీఆర్ అజేయుడు.. చిల్లర రాజకీయాలకు వణకడు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

ABN , Publish Date - Feb 01 , 2026 | 08:50 PM

ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్ అని ప్రశంసించారు..

కేసీఆర్ అజేయుడు.. చిల్లర రాజకీయాలకు వణకడు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..
KTR

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును (KCR) సిట్ అధికారులు ఇవాళ (ఆదివారం) విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.


తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్ అని కొనియాడారు. ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయని వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడిన మనిషి కేసీఆర్ అని, చిల్లర రాజకీయాలు, నీచమైన ఎత్తుగడలకు ఆయన వణికిపోయే వ్యక్తి కాదని.. కేసీఆర్ అజేయుడు అని కొనియాడారు.


మూర్ఖులు చరిత్రను సృష్టించడం పక్కన పెడితే.. కనీసం చరిత్రను అర్థం కూడా చేసుకోలేరని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎవరు ఎంత విషం చిమ్మినా.. ఆయన్ను ఏమీ చేయలేరని హెచ్చరించారు. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర.. ఆ చరిత్రలో మీరు కనీసం ఒక చిన్న ఫుట్‌నోట్ (Footnote) కూడా కాలేరని కేటీఆర్ ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ సమగ్ర దర్యాప్తు.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే..!

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 09:03 PM