Home » Telangana Phone Tapping Case
ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలో పూర్తవ్వాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేస్తోందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా, వద్దా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను.. సిట్ సుమారు నాలుగున్నర గంటలకు పైగా విచారించింది. ఈ విచారణలో సిట్ అధికారులు పలు కీలక అంశాలపై కేసీఆర్‌ను నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం.
ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్ అని ప్రశంసించారు..
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసానికి పోలీసులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం మధ్య జరుగుతున్న నోటీసుల పర్వం ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా సిట్ వేగవంతమైన చర్యలు చేపట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది..
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ని సిట్ అధికారులు శుక్రవారం విచారించనున్నారు. ఈ నేపథ్యంలో నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు చేరుకుని, ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని నిబంధనలను పాటిస్తూ పోలీసులు ఇంటి పరిసరాలను తనిఖీలు చేసినట్లు సమాచారం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద, కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు సూచించారు..