Balapur Laddu Auction: రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:09 AM
భాగ్యనగరంలో బాలాపూర్ వినాయకుడు లడ్డూకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ లడ్డూను దక్కించుకోవడానికి ఎంతోమంది భక్తులు పోటీపడుతుంటారు. ఈ ఏడాది కూడా లడ్డూ వేలం పాట ఎంతో ఉత్కంఠగా కొనసాగింది.
హైదరాబాద్, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో బాలాపూర్ వినాయకుడు లడ్డూకు (Balapur Laddu Auction) ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ లడ్డూను దక్కించుకోవడానికి ఎంతోమంది భక్తులు పోటీపడుతుంటారు. ఈ ఏడాది కూడా లడ్డూ వేలం పాట ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. ఈ సారి రూ.35.00లక్షల ధర పలికింది బాలాపూర్ లడ్డూ ప్రసాదం.
కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ ఈ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూను రూ.30.01 లక్షలకు బాలాపూర్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లడ్డూ రూ.4.99లక్షలకు అధిక ధర పలికింది. గత ఆరేళ్లుగా బాలాపూర్ లడ్డూను దక్కించుకోవాలని చూస్తున్నానని.. స్వామివారు ఇప్పుడు కరుణించారని లింగాల దశరథ గౌడ్ పేర్కొన్నారు.
లడ్డూ వేలం పాటను చూసేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. లడ్డూ వేలం పాట సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వేలం తర్వాత హుస్సేన్‌సాగర్ వైపు బాలాపూర్ గణేశుడు శోభాయాత్ర కొనసాగనుంది. బాలాపూర్ నుంచి 16కిలోమీటర్ల మేర సాగనుంది గణేశుడి శోభాయాత్ర. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, లిబర్టీ చౌరస్తా మీదుగా ఈ శోభాయాత్ర కొనసాగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు ఫైర్
రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం
Read Latest Telangana News and National News