Home » Balapur Ganesh
బాలాపూర్ గణేషుడి లడ్డూ ఈ ఏడాది మునుపెన్నడూ లేని రీతిలో వేలంపాటలో రికార్డు ధర కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కానీ, ఇదొక్కటే కాదు.. బాలాపూర్ గణపయ్యకు రికార్డు స్థాయిలో కానుకలు సమర్పించారు భక్తులు. కేవలం 11 రోజుల్లోనే ఎన్ని లక్షల ఆదాయం వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు..
భాగ్యనగరంలో బాలాపూర్ వినాయకుడు లడ్డూకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ లడ్డూను దక్కించుకోవడానికి ఎంతోమంది భక్తులు పోటీపడుతుంటారు. ఈ ఏడాది కూడా లడ్డూ వేలం పాట ఎంతో ఉత్కంఠగా కొనసాగింది.
ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా బాలాపూర్ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మండపం ప్రతిసారి ఒక కొత్త ఆలయ నమూనాలో నిర్మించడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత.
బాలాపూర్ గణపతి లడ్డూ(Balapur Ganapati Ladoo) వేలానికి ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 1980లో ఉత్సవాలు ప్రారంభం కాగా, వేలం మాత్రం 1994లో మొదలైంది.
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూలపైన అందరి దృష్టి ఉంటుంది. నవరాత్రులు ముగిశాయి. ఖైరతాబాద్‌లోని మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. ఇక బాలాపూర్ లడ్డూ సైతం వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర పలికింది.
వినాయకుడి ఉత్సవాలతో పాటు, నిమజ్జన ఊరేగింపు కూడా బాలాపూర్ గణేష్(Balapur Ganesh)తోనే మొదలుకావడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి గణనాథుడి విగ్రహాన్ని ఈ సంవత్సరం వినూత్నంగా తీర్చిదిద్దారు. తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు.
బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ధర రూ.27 లక్షలు పలికింది. తుర్కయంజాల్‌కు చెందిన దాసరి దయానందరెడ్డి రెడ్డి బాలపూర్ గణేష్ లడ్డూను కైవసం చేసుకున్నాడు. అంతకుముందు బాలాపూర్ గణేష్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. బాలాపూర్ పురవీధుల్లో ఊరేగింపుగా సంస్కృతి కార్యక్రమాలు, భజనలతో శోభాయాత్ర శోభాయామానంగా సాగింది.