Karnataka CM : డీకే, సీఎం సిద్ధరామయ్య టీపార్టీ మీటింగ్.. రొటేషనల్ సీఎం ఒప్పందంపై చర్చ !
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:37 AM
ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
బెంగళూరు, నవంబర్ 29: చెప్పినట్టే కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఈ ఉదయం టీ పార్టీ మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి డీకే శివకుమార్ ఎక్స్‌లో పోస్ట్ కూడా చేశారు. ఈ ఉదయం బెంగళూరులోని కావేరి నివాసంలో అల్పాహార సమావేశం కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశానని డీకే చెప్పారు. కర్ణాటక ప్రాధాన్యతలు, ముందుకు సాగాల్సిన మార్గాలపై ఫలప్రదమైన చర్చ జరిగిందని వెల్లడించారు.
అయితే, డీకే శివకుమార్ తన ఎక్స్ సందేశంలో తెలుపనప్పటికీ సీఎం సిద్దరామయ్యతో టీపార్టీ మీటింగ్ ముఖ్యంగా రొటేషనల్ సీఎం ఒప్పందంపై చర్చించుకునేందుకేనన్నది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే ఇరువురు నేతలు టీపార్టీ మీటింగ్ పేరిట కలుసుకుని మాట్లాడుకున్నట్టు సమాచారం.
ఇలా ఉండగా, 2023లో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎవరు రాష్ట్రానికి సీఎం కావాలన్న ప్రశ్న ఉదయించింది. అయితే, అధిష్టానం సూచన మేరకు ఇరువురు నేతలు రొటేషనల్ ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిగా వ్యవహరించలన్న ఒప్పందం జరిగింది. దీంతో సిద్ధారామయ్య CMగా, శివకుమార్ డిప్యూటీగా నియమితులయ్యారు. ఇప్పుడు, ఆయా కాలం పూర్తయ్యే సమయంలో, ఈ ఒప్పందం మళ్లీ తెరమీదకి వచ్చింది.
ప్రజల ఎన్నికల తీర్పు ప్రకారం 2028 వరకు పూర్తి కాలంపాటు సీఎంగా వ్యవహరిస్తానని సీఎం సిద్ధరామయ్య పలు సందర్భాల్లో వ్యాఖ్యనించారు. అయితే, అదే సమయంలో పార్టీ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొస్తున్నారు. దీంతో ఈ ఇప్పుడు ఈ అంశం మీద అందరి దృష్టీ పడింది.
మరోవైపు, ఇవాళ(నవంబర్ 30) ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇరువురు నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
MS Dhoni Wedding Speech: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పెళ్లిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్..
మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!