Home » CM Siddaramaiah
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యనుద్దేశించి ఆయన.. ఓ ఔట్ గోయింగ్ సీఎం అంటూ అనడంతో.. కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా.. చచ్చిందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్. జైల్లో ఉండే దొంగలకు, తీవ్రవాదులకు బయటినుంచి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమంటూ ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎమ్మెల్యే కృష్ణ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేవలం.. నాటుకోడి, చికెన్ సూప్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కన్నడ నాట తీవ్ర సంచలనానికి దారితీశాయి. కాగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు మండిపడున్నాయి.
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ మిగతా పదవీకాలం రెండున్నరేళ్లలో ఎవరు ముఖ్యమంత్రిగా వ్యవహరించాలనే అంశం రసకందాయంలో పడింది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరుగగా, ఇవాళ..
ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
మాలో ఎటువంటి గ్రూపులు లేవు... 2028లో కూడా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవన్నారు.
ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి.. అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆయన తన కుర్చీని కాపాడుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఓ కీలక పదవి వరించే అవకాశాలున్నాయనే వార్తలను పార్టీ వర్గాలు వెల్లడిస్తుండగా.. ఆ పదవి ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
కేవలం సబ్సిడీలకోసం సినిమా తీయవద్దని, ఇటీవల సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడిందని, మంచి సినిమాలు తీసి రాయితీ పొందాలని సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి ఏడాది సినిమా పురస్కారాలు ఇస్తామన్నారు.
రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.