R Ashok: ప్రతిపక్ష నేత ఆగ్రహం.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా.. చచ్చిందా.?
ABN , Publish Date - Dec 18 , 2025 | 01:48 PM
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా.. చచ్చిందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్. జైల్లో ఉండే దొంగలకు, తీవ్రవాదులకు బయటినుంచి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమంటూ ఆయన మండిపడ్డారు.
బళ్లారి(బెంగళూరు): జైల్లో ఉండే దొంగలకు, తీవ్రవాదులకు బయటినుంచి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. బయట నాలుగు హత్యలు చేసి జైలుకు వెళ్లిన సీనా, అనేక నేరాలపై జైలుకెళ్లిన వారికి అక్కడే అన్నీ అందుతున్నాయని విధానసభ ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్(R. Ashok) మండిపడ్డారు. బెళగావిలో జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో బుధవారం ప్రత్యేక అంశంపై చర్చ సమయంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ఉన్న పోలీసులు కొందరు దొంగలు, ఖూనీ కోర్లతో కలిసి నేరాలను ప్రోత్సహిస్తున్నారని అశోక్ ఆరోపించారు. జైలులో ఉంటూనే తీవ్రవాదులు, వివిధ హత్యకేసుల్లో శిక్ష అనుభవిస్తున్నవారు బయట నేరాలు చేయిస్తున్నారన్నారు. జైల్లోనే బర్డ్‌డేలు చేసుకుని కేక్ కట్‌చేయడం, గంజాయి తాగడం ఇలా అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుకు ఉదాహరణగా సభలో ఆయన పెన్‌డ్రైవ్‌ను సాక్ష్యంగా చూపారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా.. చచ్చిందా అని ఆయన సభలో హోం మంత్రి పరమేశ్వర్‌ను ప్రశ్నించారు. దీనికి హోం మంత్రి సమాధానమిస్తూ.. ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. కానీ వాస్తవాలు ఉంటే పరిశీలించి నేరాలకు పాల్పడే పోలీసులపై క్రమశిక్షణ తీసుకుంటామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ
Read Latest Telangana News and National News