Raghuram Rajan Warns India: సూపర్ పవర్ అంతా ఈజీ కాదు
ABN , Publish Date - Dec 18 , 2025 | 06:43 AM
భారతదేశం సూపర్ పవర్ కాదని, అలా అనుకోవడం పరిణతి లేనితనానికి నిదర్శనమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అలాంటి ఆకాంక్ష ఉండడం..
న్యూఢిల్లీ: భారతదేశం సూపర్ పవర్ కాదని, అలా అనుకోవడం పరిణతి లేనితనానికి నిదర్శనమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అలాంటి ఆకాంక్ష ఉండడం మాత్రం మంచిదేనంటూ ఆ స్థితిని చేరడానికి కొన్ని దశాబ్దాల కాలం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ముందుగా జాతి నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఎంటర్‌ప్రెన్యూర్ కుశాల్ లోధా పాడ్‌కా్‌స్టలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రాబోయే 30 సంవత్సరాల కాలంలో దేశ ప్రజలందరూ ఎంతో కష్టపడినప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని తెలిపారు. ప్రస్తుతం మనం సాధిస్తున్న వృద్ధిని చూసి అలసత్వం ప్రదర్శించరాదంటూ ఉద్యోగ, నైపుణ్య కల్పనలోను, నాణ్యమైన విద్య, ఉత్పాదకత వంటి విషయాల్లోను మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ప్రస్తుత వృద్ధి గణాంకాలు చూసి మనం ఆర్థిక బలంగా ఉన్నట్టు భావించకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి
యశోద హాస్పిటల్స్, ఆర్‌ఎస్ బ్రదర్స్ పబ్లిక్ ఇష్యూలకు సెబీ ఓకే