SEBI IPO Approval: యశోద హాస్పిటల్స్ ఆర్‌ఎస్ బ్రదర్స్ పబ్లిక్ ఇష్యూలకు సెబీ ఓకే
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:59 AM
దేశంలో పబ్లిక్ ఇష్యూల (ఐపీఓ) జోరు కొనసాగుతోంది. సెకండరీ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లలో ఉన్నా ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు... ఐపీఓల ద్వారా సొమ్ము చేసుకునేందుకు...
మరో ఐదు ఐపీఓలకు అనుమతి 8 రూ.6,000 కోట్ల వరకు సమీకకరణ
న్యూఢిల్లీ: దేశంలో పబ్లిక్ ఇష్యూల (ఐపీఓ) జోరు కొనసాగుతోంది. సెకండరీ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లలో ఉన్నా ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు... ఐపీఓల ద్వారా సొమ్ము చేసుకునేందుకు ఎగబడుతున్నారు. దీంతో ఈ నెల 8-12 మధ్య మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో ఏడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా యశోద హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్, ఆర్‌ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా ఫాపింగ్ మాల్స్ పేరుతో రిటైల్ షోరూమ్స్‌ను నిర్వహిస్తున్న ఆర్‌ఎ్‌సబీ రిటైల్ ఇండియా కూడా ఉన్నాయి. ఈ ఏడు కంపెనీలు ప్రైమరీ మార్కెట్ నుంచి దాదాపు రూ.6,000 కోట్ల వరకు సమీకరించనున్నాయి. ఈ కంపెనీలన్నీ ఐపీఓల కోసం ఈ ఏడాది మే-సెప్టెంబరు మధ్య కాలంలో సెబీకి దరఖాస్తు చేశాయి.
యశోద హెల్త్‌కేర్ రూ.4,000 కోట్ల సమీకరణ
తాజాగా సెబీ ఆమోదం పొందిన ఐపీఓల్లో యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్ ఇష్యూనే పెద్దది. సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు సమీకరించే వీలుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆర్‌ఎ్‌సబీ రిటైల్ ఇండియా కూడా తాజాగా షేర్ల జారీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించనుండగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) కింద 2.98 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. కంపెనీ ఈ నిధులను రుణాల చెల్లింపు, ఆర్‌ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ పేరుతో కొత్త స్టోర్ల ఏర్పాటుకు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు వినియోగించనుంది.
ఈ రెండు కంపెనీలతో పాటు ఫ్యూజన్ సీఎక్స్, ఓరియంట్ కేబుల్స్ (ఇండియా) లిమిటెడ్, టర్టిల్‌మెంట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్, ఎస్‌ఎ్‌ఫసీ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్, లోహియా కార్ప్ కంపెనీల ఐపీఓలకూ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఫ్యూజన్ సీఎక్స్ రూ.1,000 కోట్లు, ఓరియంట్ కేబుల్స్ (ఇండియా) లిమిటెడ్ రూ.700 కోట్ల వరకు ఐపీఓల ద్వారా సమీకరించనున్నాయి.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..