Home » Bengaluru News
ఉత్తరకన్నడ జిల్లా ఓడరేవుకు అనుబంధమైన భట్కళ్‌ను 24 గంటల్లో పేల్చివేస్తామని మెయిల్ ద్వారా సందేశం పంపిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈనెల 10న ఉదయం 7.23 గంటలకు పోలీస్ స్టేషన్‌కు ఓ మెయిల్ వచ్చిందని ఉత్తరకన్నడ ఎస్పీ ఎం నారాయణ్ తెలిపారు.
దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వేలో విప్లవాత్మక మార్పులొచ్చాయనీ, తాను పదవీబాధ్యతలు స్వీకరించిన స్వల్పకాలంలోనే రాష్ట్రంతో సహా అనేక ప్రదేశాలలో మరిన్ని రైళ్లు మంజూరయ్యాయని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న అన్నారు.
సిలికాన్ సిటీ బెంగళూరులో వీధికుక్కలకు మాంసాహారం అందించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె టెండర్లు ఆహ్వానించింది. 8 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. రూ.2.88 కోట్లు ఖర్చు చేసేందుకు అంచనా వేశారు.
ఏ పార్టీలో ఉండాలనేదిగానీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేదిగానీ నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు కానీ పోటీ చేయడం మాత్రం తథ్యమని చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ స్పష్టం చేశారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. పార్టీ ప్రముఖ నేతలతో సరిపడక దూరంగా ఉన్నానన్నారు.
ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అంటూ సిద్దరామయ్య ఢిల్లీ వేదికగా పదే పదే ప్రకటించినా అధిష్ఠానానికి చెందిన ముఖ్యులు ఎవరూ స్పందించకపోవడం, పైగా గతంలో మాదిరిగా ఎవరూ నాయకత్వ మార్పు గురించి మాట్లాడరాదని హుకుం జారీ చేసిన అగ్రనేతలు ఈ అంశమే మాకు సంబంధం లేదనేలా ఉండడంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్ ఒక్కసారిగా దిగాలు పడ్డారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని నెలల్లోనే మార్పులు ఉంటాయని, అందులో ప్రధానంగా నాయకత్వ మార్పు ఉంటుందనే అంశం కొన్ని నెలలుగా హల్చల్ చేస్తోంది.
తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్ఎల్సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్, హెచ్ఎల్సీ ఈఈ చంద్రశేఖర్, డ్యాం స్వీచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు.
మరో నాలుగేళ్ళలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతలను తీహార్ జైలులో వేస్తామని చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్(Chikkaballapur MLA Pradeep Eshwar) మండిపడ్డారు.
రాయచూరు తాలూకాలోని డి.రాంపూర్ (డొంగరాంపూర్) సమీపంలోని పరమేశ్వర గుట్టలో మరో సారి చిరుత(Leopard) సంచారం కలకలం రేపుతోంది.
చన్నపట్టణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్‌కు వ్యతిరేకంగా భార్య, కుమార్తెలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలాను వారు భేటీ అయ్యారు.