Share News

ఆయనవి ‘గాలి’ మాటలు..!

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:38 PM

ఆయనవి ‘గాలి’ మాటలు.., ఆయన చెప్పేవాటిలో ఒక్కటికూడా నిజం లేదని గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి జనార్దన్‌రెడ్డిపై మాజీ మంత్రి, బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర మండిపడ్డారు. పవిత్రమైన శాసనసభకు గాలి జనార్దన్‌రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు.

ఆయనవి ‘గాలి’ మాటలు..!

  • గాలి జనార్దన్‌ రెడ్డిపై మాజీమంత్రి నాగేంద్ర ఫైర్‌

  • సభకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం

బళ్లారి(బెంగళూరు): పవిత్రమైన శాసనసభకు గాలి జనార్దన్‌రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారు, బళ్లారిలో మహర్షి వాల్మీకి ఫ్లెక్సీ వివాదంలో జరిగినదానికి, ఆయన చెప్పేదానికి పొంతన లేదని మాజీ మంత్రి, బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర(Nagendra) ఆగ్రహం వ్యక్తం అయ్యారు. విధానసభ అత్యవసర సమావేశాల్లో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) బళ్లారి అల్లర్లపై సభలో మాట్లాడారు. అయితే అవన్నీ అసత్యాలని మాజీ మంత్రి నాగేంద్ర అన్నారు. శుక్రవారం ఆయన గాలి ఆరోపణలపై సుదీర్ఘంగా కౌంటర్‌ ఇచ్చారు.


గాలి జనార్దన్‌రెడ్డికి జడ్‌ కేటగిరీ భద్రత కావాలని కోరారని, అది కేంద్రానికి సంబంధించిన విషయమన్నారు. వారు భద్రత కల్పిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గాలిపై 7.6 అనే బుల్లెట్‌ దూసుకొచ్చిందని ఆరోపిస్తున్నారని, అది అబద్ధమన్నారు. ఎవరినో కాలిస్తే, ఆయన మీదకు ఎలా వచ్చిందో తనకు తెలియదన్నారు. రాత్రి వేళల్లో బుల్లెట్‌ ఎలా దొరికిందని, దానిని పోలీసులకు అప్పగించకుండా మీడియాకు ఎందుకు చూపారన్నారు. సీఎం, డీసీఎంలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తొలగించాలన్నారు. అంతే కాకుండా బళ్లారిలో జనవరి 7న బీజేపీ సభలో మాజీ ఎంపీ శ్రీరాములు ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డిపై పాతాలంలో ఉన్నా వదిలిపెట్టను అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.


గాలి జనార్దన్‌రెడ్డి రాష్ట్రంలో వాల్మీకి నాయకుడు ఉన్నాడంటే అది ఒక్క శ్రీరాములే అనడం విడ్డూరమని, జనం కోర్టులో ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ సవాల్‌ విసిరారు. జనార్దన్‌రెడ్డి ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ బళ్లారి’గా మార్చాలనుకుంటే కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఉండదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేంది లేదన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుతున్నామని, దోషులను శిక్షిస్తామన్నారు.


pandu1.2.jpgచివరిలో సభలో స్పీకర్‌ మాట్లాడుతూ బళ్లారిలో ప్రశాంత వాతావరణం కల్పించాలని, మీరే ఇలా సభలో వాగ్వావాదం చేసుకుంటే బళ్లారి ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు. బళ్లారి ప్రజలకు రుణపడి ఉంటామని, అక్కడ ప్రజలు చాలా సౌమ్యులు, బీజేపీ వారే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నాగేంద్ర మరోసారి ధ్వజమెత్తారు. మొత్తం మీద శుక్రవారం విధానసభ బళ్లారి గొడవలపై చర్చ జోరుగా సాగింది.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ధరలు రికార్డు స్థాయిలో డౌన్! నేటి రేట్స్ ఇవీ

భారతి సిమెంట్స్‌కు చెక్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 31 , 2026 | 01:38 PM