పసిడి ధరలు రికార్డు స్థాయిలో డౌన్! నేటి ధరలివే..
ABN , Publish Date - Jan 31 , 2026 | 06:32 AM
ఇన్వెస్టర్లు శుక్రవారం ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం, వెండి ధరలు శుక్రవారం రికార్డు స్థాయిలో దిద్దుబాటుకు లోనయ్యాయి. 24 క్యారెట్ పసిడి ధర దేశంలో సగటున రూ.9వేల మేర తగ్గింది. వెండి ధరలో కూడా రూ.15 వేల మేర కోత పడింది. ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ధరలు పతనమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఇది సహజమేనని, దీర్ఘకాలికంగా మాత్రం ధరల్లో బులిష్ ట్రెండ్ కొనసాగుతుందని చెబుతున్నారు (Gold, Silver Rates in Hyderabad on Jan 31).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం (జనవరి 31) ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,190గా ఉంది. నిన్నటితో పోలిస్తే ధర రూ.9,650 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి రేటు కూడా రూ.8,850 మేర తగ్గి రూ.1,55,100కు దిగొచ్చింది. చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర అత్యధికంగా రూ.1,72,900 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ పసిడి రూ.1,69,100 వద్ద ట్రేడవుతోంది.
ఇక హైదరాబాద్‌లో నిన్న (శుక్రవారం) వెండి ధరలో రూ.20 వేల మేర కోతపడింది. ప్రస్తుతం కిలో వెండి రూ.4,05,000 వద్ద ట్రేడవుతోంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో కిలో వెండి రూ.3,94,900గా ఉంది. అంతర్జాతీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పతనమయ్యాయి. ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ బంగారం ప్రస్తుతం 4,888 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఔన్స్ వెండి 98 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
బడ్జెట్ 2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?
మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్