Share News

మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్‌

ABN , Publish Date - Jan 30 , 2026 | 06:24 AM

భారత పౌర విమానయాన మార్కెట్‌ భవిష్యత్‌పై విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ అత్యంత ఆశాభావంతో ఉంది. మరో పదేళ్లలో భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద పౌర విమానయాన..

మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్‌

ఎయిర్‌బస్‌ ఇండియా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత పౌర విమానయాన మార్కెట్‌ భవిష్యత్‌పై విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ అత్యంత ఆశాభావంతో ఉంది. మరో పదేళ్లలో భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్‌గా ఎదగనుందని ఎయిర్‌బస్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా ప్రెసిడెంట్‌, ఎండీ జర్జన్‌ వెస్టర్‌మీయర్‌ చెప్పారు. గురువారం నాడిక్కడ వింగ్స్‌ ఇండియా 2026లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత విమానయాన సంస్థలు వంద కంటే ఎక్కువ సీట్లు ఉన్న 850 వాణిజ్య విమానాలను నడుపుతున్నాయని, 2035 నాటికి ఈ సంఖ్య 2,250కి చేరనుందని చెప్పారు. ఇదే సమయంలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 2035 నాటికి ప్రస్తుత 150 నుంచి 200కు చేరే అవకాశం ఉందన్నారు. ఈ అభివృద్ధితో వచ్చే పదేళ్లలో భారత విమానయాన రంగంలో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం 12,000గా ఉన్న పైలెట్ల సంఖ్య 35,000కు, సాంకేతిక సిబ్బంది సంఖ్య 11,000 నుంచి 34,000కు చేరనుందన్నారు.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..

యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..

Updated Date - Jan 30 , 2026 | 06:24 AM