యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:41 PM
అది రెండో ప్రపంచ యుద్ధ కాలం.. సోవియట్ సైనికులు పోలాండ్‌ను ఆక్రమించుకుంటున్నారు.. పోలెండ్ వాసుల ఇళ్లు, ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు.. ఆ సమయంలో ఆడమ్ గ్లాజెవ్స్కీ అనే వ్యక్తి సోవియట్ సైన్యం బెదిరింపు కారణంగా తన భవనం నుంచి పారిపోవలసి వచ్చింది.
అది రెండో ప్రపంచ యుద్ధ కాలం.. సోవియట్ సైనికులు పోలాండ్‌ను ఆక్రమించుకుంటున్నారు.. పోలెండ్ వాసుల ఇళ్లు, ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు.. ఆ సమయంలో ఆడమ్ గ్లాజెవ్స్కీ అనే వ్యక్తి సోవియట్ సైన్యం బెదిరింపు కారణంగా తన భవనం నుంచి పారిపోవలసి వచ్చింది. అతడి దగ్గర బోలెడంత సంపద ఉంది. దాంతో అతడు ఆ సమయంలో చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత అతడి మనవడు జాన్ గ్లాజెవ్స్కీకి అదృష్టాన్ని తీసుకొచ్చింది (treasure buried during war).
1939లో, జాన్ తాత ఆడమ్ గ్లాజెవ్స్కీ సోవియట్ సైన్యం బెదిరింపు కారణంగా పోలెండ్‌లోని తన ఇల్లు వదిలేసి వేరే దేశానికి పారిపోవలసి వచ్చింది. అప్పటికి అతడి దగ్గర బంగారు నాణేలు, వెండి వస్తువులు, ఆభరణాలు ఉన్నాయి. వాటిని తీసుకుని వెళ్లడం సాధ్యం కాదు. దాంతో వాటిని తన భవనానికి సమీపంలో పాతిపెట్టాడు. యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి పోలెండ్ వెళ్లలేకపోయాడు. భవనం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ నిధి మాత్రం అలాగే ఉంటుందని అతడికి నమ్మకం ఉంది (grandson finds hidden treasure).
తను చనిపోయే ముందు తన కొడుకు గుస్తావ్‌కు నిధి ఉన్న చోటు గురించి చెప్పాడు. తండ్రి చెప్పిన గుర్తుల ఆధారంగా గుస్తావ్ ఒక మ్యాప్ రెడీ చేశాడు. అయితే అతడు కూడా తన జీవిత కాలంలో పోలెండ్ వెళ్లలేకపోయాడు. ఆ మ్యాప్ ఇటీవల అతడి కొడుకు జాన్ గ్లాజెవ్స్కీకి దొరికింది. ఆ మ్యాప్ ఆధారంగా జాన్ పోలెండ్‌లోని తన పూర్వీకుల భవనానికి చేరుకుని గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. మొదట్లో ఏమీ దొరకలేదు. కానీ, బాగా లోతుకు తవ్విన తర్వాత మట్టిలో బంగారు నాణేలు, వెండి పాత్రలు బయటపడ్డాయి (wartime survival story).
19వ శతాబ్దానికి చెందిన ఆ నాణేలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మిలియన్ల డాలర్ల విలువైనవి (treasure discovery). తాత పాతిపెట్టిన నిధిని 80 సంవత్సరాల తర్వాత దక్కించుకోవడంతో జాన్ ఆనంధానికి అవధులు లేకుండాపోయాయి. ఈ నిధి కేవలం బంగారం కాదని, ఇది 80 సంవత్సరాల తర్వాత నేల నుంచి ఉద్భవించిన ఒక కుటుంబం కథ అని చెబుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..
జంక్‌ఫుడ్ ప్రచారంపై పరిమితులు.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు బ్యాన్ చేయాలి..