ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:18 PM
సాధారణంగా ఒక దేశ అత్యున్నత, సెన్సిటివ్ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులు అలాంటి ప్రాంతాలకు వెళ్లలేరు. వీఐపీలు కూడా అక్కడ కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రోటోకాల్స్ విషయంలో ప్రధాని లేదా దేశ అధ్యక్షులకు మినహాయింపులు ఉంటాయి.
సాధారణంగా ఒక దేశ పార్లమెంట్, ఇతర సెన్సిటివ్ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులు అలాంటి ప్రాంతాలకు వెళ్లలేరు. వీఐపీలు కూడా అక్కడ కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ ప్రోటోకాల్స్ విషయంలో ప్రధాని లేదా దేశ అధ్యక్షులకు మినహాయింపులు ఉంటాయి. అయితే ఇజ్రాయెల్‌లో ప్రధానికి కూడా సెక్యూరిటీ విషయంలో మినహాయింపు ఉండదు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్ వెనుక కెమెరాకు రెడ్ టేప్ వేసి ఉండడం చర్చనీయాంశంగా మారింది (Netanyahu phone camera covered).
జెరూసలేంలోని ఇజ్రాయెల్ పార్లమెంట్, నెస్సెట్ సెల్లార్ పార్కింగ్ ప్రాంతంలో తీసిన నెతన్యాహు ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెతన్యాహు తన కారు పక్కన నిలబడి ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఆయన్ ఫోన్ కెమెరాకు రెడ్ టేప్ అంటించి ఉంది. నెతన్యాహు ఫోన్ కెమెరాకు అతికించిన ఎరుపు రంగు స్టిక్కర్ సాధారణమైనది కాదు. ఇది ట్యాంపర్ ఎవిడెన్స్ సీల్. అధిక భద్రతా ప్రాంతాల్లో ఉపయోగించే ప్రత్యేక స్టిక్కర్ (Israel PM phone security).
ఈ స్టిక్కర్ ఫోన్ కెమెరాను కవర్ చేస్తుంది. ఎవరైనా అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా సున్నితమైన సమాచారాన్ని ఫోటోలు తీయకుండా నిరోధిస్తుంది. ఫోన్‌లలో కెమెరాలు, మైక్రోఫోన్‌లు, ఇతర అనేక సెన్సార్‌లు ఉంటాయి. వీటిని ఉపయోగించి రహస్య సమాచారాన్ని రికార్డ్ చేయవచ్చు. జెరూసలేంలోని నెస్సెట్ వంటి నిషేధిత ప్రభుత్వ ప్రాంతాలలో ఫోటోలు తీయడంపై పూర్తి స్థాయిలో నిషేధం ఉంది. జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా ఇజ్రాయెల్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను, టిక్‌టాక్ వంటి కొన్ని యాప్‌లను ఉపయోగించడంపై కఠినమైన నియమాలు ఉన్నాయి (camera hacking risks).
ఈ కారణంతోనే ఇజ్రాయెల్ ప్రధాని అయినప్పటికీ నెతన్యాహు ఫోన్ కెమెరాను కూడా రెడ్ టేప్‌తో సీల్ చేశారు (smartphone surveillance). అధునాతన గూఢచర్య సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయెల్ సొంతం. ఇజ్రాయెల్ పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి అనేక దేశాలలోని జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రపంచ నాయకులపై కూడా నిఘా ఉంచిందని కొన్ని సంవత్సరాల క్రితం ఆరోపణలు వచ్చాయి. 2022లో ఇజ్రాయెల్ పోలీసులు స్పైవేర్ పరికరాలను ఉపయోగించి సాధారణ పౌరులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులపై కూడా నిఘా ఉంచారని విమర్శలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
విచిత్రం, 1966లో తులం బంగారం కంటే తాజ్ హోటల్‌లో బస చేయడమే ఎక్కువ ఖరీదు..
మీ కళ్ల షార్ప్‌నెస్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో బల్లిని 15 సెకెన్లలో కనిపెట్టండి..