Home » Israel
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని యూఏఈలో భారత రాయబారి దీపక్ మిట్టల్ తెలిపారు.
కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కో-పైలట్ ఒమన్ దేశస్థుడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ తెలిపారు.
ముంబై 26/11 ఉగ్రదాడులు.. దేశం ఎన్నటికీ మర్చిపోలేని విషాద గాథ. ఆ దాడుల్లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న రెండేళ్ల ఇజ్రాయెలీ బాలుడు మోషేను ప్రాణాలకు తెగించి కాపాడిన భారతీయ నానీ సాహసం ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనలో ధైర్యంగా వ్యవహరించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారాన్ని ప్రకటించింది.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ నుంచి దుబాయ్‌కు వెళ్లే ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఎఫ్‌జెడ్ 1073 ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్‌కు చెందిన కోపైలట్ కత్తితో దాడిచేసిన నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను రద్దు చేశారు.
ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌ను కత్తితో పొడిచిన కోపైలట్‌ను నిలువరించిన ప్రయాణికుడు యానివ్ హయూన్‌ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు.
'ఫ్లైదుబాయ్' ఫ్లైట్ ఘటనలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కొందరు ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి కాక్‌పిట్ తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించి పెద్దముప్పును తప్పించినట్టు తెలుస్తోంది.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమానం నుంచి తొలుత అత్యవసర సంకేతం, ఆ తర్వాత 7500 హైజాక్ కోడ్ ప్రసారం కావడంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమయ్యారు.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఐదుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో మహిళ మరణించింది.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న 'ఫ్లై దుబాయ్' విమానంలో బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విమానం అత్యవసర సంకేతాలను పంపడంతో దాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించారు.