Share News

Pakistan Burns: పాలస్తీనా శాంతిస్తుంటే.. భగ్గుమంటోన్న పాక్

ABN , Publish Date - Oct 13 , 2025 | 08:37 PM

గాజాలో మరణాలు, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్‌-ఇ-లబైక్‌ పాకిస్థాన్‌ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ రణరంగంగా మారింది. గతవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.

 Pakistan Burns: పాలస్తీనా శాంతిస్తుంటే.. భగ్గుమంటోన్న పాక్
Pakistan protests

ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండేళ్లుగా ఉన్న ఉద్రికత్త పరిస్థితులకు నేటితో ముగింపు పలికింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళిక ద్వారా పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం తగ్గింది. రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ నుంచి ప్రాణ భయం తప్పడంతో పాలస్తీనా ప్రజలు సంతోషిస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ మంత్రం భగ్గుమంటోంది. గాజాలో మరణాలు, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్‌-ఇ-లబైక్‌ పాకిస్థాన్‌ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ రణరంగంగా మారింది.

గతవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసుల ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నిరసనల్లో ఒక అధికారి సహా పలువురు మృతి చెందారు. అలానే లాహోర్‌లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. గాజా యుద్ధం ముగింపుపై పాలస్తీనా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం హింసాత్మకంగా మారడం గమనార్హం.


పాలస్తీనా ప్రజలకు మద్దతుగా టీఎల్‌పీ లాహోర్‌, ఇతర ప్రధాన నగరాల్లో ప్రాంతాల్లో నిరసనలు చేపడుతోంది. ఇక ఇటీవల ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఏకంగా ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీ ముట్టడి (US embassy march)కి వ్యూహం రచించింది. ఈ క్రమంలో ఆందోళన కారులను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలు హింసకు దారి తీస్తున్నాయి. అధికారులపై ఆందోళనకారులు కాల్పులు జరిపారని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు తమ మద్దతు దారులు అనేకమంది మరణించారని, గాయపడ్డారని టీఎల్‌పీ ఆరోపిస్తోది.


పోలీసులు నిరసనకారులపై (Pakistan faces unrest) జరిపిన కాల్పుల్లో టీఎల్‌పీ చీఫ్ సాద్‌ రిజ్వీ గాయపడినట్లు సమాచారం. అంతకము ముందే ఆయన విడుదల చేసిన వీడియోలో ఫైరింగ్ చేయొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు కనిపిస్తోంది. మరొక వీడియోలో.. పలు వాహనాలు మంటల్లో కాలిపోతున్నాయి. ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపుగా వెళ్లకుండా రోడ్లపై పెద్ద పెద్ద కంటైనర్లను అడ్డుగా పెట్టారు. వాటిని తొలగించడంతో తాజాగా మరోసారి పోలీసులకు ఆందోళన కారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి.


ఇవి కూడా చదవండి:

నోబెల్‌ శాంతి బహుమతి సమాచారం లీక్‌

58 మంది పాక్‌ సైనికులను చంపాం: అప్ఘాన్ మంత్రి

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 08:46 PM