Share News

Hamas releases hostages: బందీలను విడుదల చేసిన హమాస్.. రెండేళ్ల తర్వాత ఇంటికి..

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:48 PM

దాదాపు రెండేళ్లుగా హమాస్ బందీలుగా ఉన్న ఇరవై మంది ఇజ్రాయెల్ పౌరులు సోమవారం విముక్తి లభించింది. రెండేళ్లు హమాస్ చెరలో ఉన్న పౌరులు తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. తొలుత ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది.

Hamas releases hostages: బందీలను విడుదల చేసిన హమాస్.. రెండేళ్ల తర్వాత ఇంటికి..
hostage exchange

దాదాపు రెండేళ్లుగా హమాస్ బందీలుగా ఉన్న ఇరవై మంది ఇజ్రాయెల్ పౌరులకు సోమవారం విముక్తి లభించింది. రెండేళ్లు హమాస్ చెరలో ఉన్న పౌరులు తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. తొలుత ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. తర్వాత మరో 13 మందిని కూడా అప్పగించింది. వారిని తీసుకుని రెడ్‌క్రాస్ సంస్థ ఇజ్రాయెల్‌కు బయల్దేరింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది (Israeli hostages freed).


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణకు అప్పగించాయి. తొలి దశ ఒప్పందంలో భాగంగా ఇరు వర్గాలు బందీల విడుదలకు అంగీకరించాయి. ఈ ఒప్పందం ప్రకారం తమ వద్ద ఉన్న 48 మంది ఇజ్రాయెల్ వాసులను హమాస్ విడిచిపెట్టడానికి అంగీకరించింది. ఆ 48 మందిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నారు. వారిని ఇప్పటికే విడుదల చేసింది. అలాగే 28 మంది పౌరుల మృతదేహాలను కూడా త్వరలోనే అప్పగించనుంది (Israel Hamas news).


ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించింది (hostage exchange). రెండు వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. 2003 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి తెగబడింది. 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపేసింది. 251 మందిని అపహరించింది. వారిలో కొందరిని గతంలోనే విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని తాజగా హమాస్ విడుదల చేసింది.


ఇవి కూడా చదవండి:

నోబెల్‌ శాంతి బహుమతి సమాచారం లీక్‌

58 మంది పాక్‌ సైనికులను చంపాం: అప్ఘాన్ మంత్రి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 06:24 PM