Home » Israel Hamas War
రెండేళ్లుగా ఉద్రిక్తతలు రేపుతున్న గాజా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. రెండేళ్లుగా తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ తాజాగా విడుదల చేసింది.
దాదాపు రెండేళ్లుగా హమాస్ బందీలుగా ఉన్న ఇరవై మంది ఇజ్రాయెల్ పౌరులు సోమవారం విముక్తి లభించింది. రెండేళ్లు హమాస్ చెరలో ఉన్న పౌరులు తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. తొలుత ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య రాజీ కుదర్చి గాజా శాంతి ఒప్పందానికి నడుం బిగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గాజా శాంతి ప్రణాళిక మొదటి దశను స్వాగతించారు. గాజా ప్రాంతంలో శాశ్వత శాంతి వైపు ఇది తొలి అడుగు అని మోదీ అభివర్ణించారు.
గాజా యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్‌లు ముందుకొచ్చాయని, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్టు తెలిపారు.
గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పోస్ట్ చేశారు.
హమాస్ శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. తాజాగా జరిగిన దాడిలో సుమారు ఆరుగురు కన్నుమూశారు.
ట్రంప్ హెచ్చరికలతో హమాస్ దిగివస్తోంది. ఇజ్రాయెల్ బందీల విడుదలకు అంగీకారం తెలిపింది. ఈ తాజా పరిణామంపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. గాజాలో ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని..
గాజాలో మహిళలు పిల్లల కడుపు నింపడానికి ఒళ్లు అమ్ముకోవాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియాకు స్థానిక మహిళలు తమ దయనీయ పరిస్థితుల అనుభవాలను వెల్లడించారు.
దోహాలోని హమాస్ స్థావరాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను ఖతర్ ఖండించింది. ఇది పిరికిపంద చర్య అంటూ మండిపడింది. గాజాలో కాల్పుల విరమణ చర్చలపై ఈ దాడులు ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో యెమెన్‌లోని హౌతీ నియంత్రిత సనా ప్రభుత్వ ప్రధాని అహ్మద్ అల్-రహవీ మరణించారు. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఘటనను ధ్రువీకరించారు.