Israeli Airstrikes Houthi PM: ఇజ్రాయెల్ దాడుల్లో హౌతీ ప్రధానమంత్రి అహ్మద్ అల్-రహవీ మృతి
ABN , Publish Date - Aug 30 , 2025 | 08:59 PM
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో యెమెన్‌లోని హౌతీ నియంత్రిత సనా ప్రభుత్వ ప్రధాని అహ్మద్ అల్-రహవీ మరణించారు. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఘటనను ధ్రువీకరించారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో (Israeli Airstrikes) యెమెన్‌లోని హౌతీ నియంత్రిత సనా ప్రభుత్వంలో ప్రధానమంత్రి అహ్మద్ అల్-రహవీ (Ahmed al-Rahawi ) మరణించారని ఇరాన్ మద్దతు గల హౌతీ టీం తెలిపింది. గురువారం జరిగిన దాడిలో అల్-రహవీతో పాటు ఇతర మంత్రులు కూడా మరణించారని హౌతీలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది ప్రభుత్వ పనితీరును సమీక్షించిన క్రమంలో అధికారులు పాల్గొంటున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు వారు పేర్కొన్నారు.
సపోర్ట్ చేసినా..
ఆగస్టు 2024 నుంచి హౌతీ నేతృత్వంలో ప్రభుత్వ ప్రధానమంత్రిగా అల్-రహావీ పనిచేస్తున్నాడు. ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడిని నిర్వహించినట్లు ధృవీకరించింది. యెమెన్‌లోని సనా ప్రాంతంలో హౌతీ ఉగ్రవాద సైనిక లక్ష్యాన్ని దెబ్బతీసినట్లు తెలిపింది. గాజాలో జరుగుతున్న యుద్ధంలో హౌతీలు పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నారు. గత కొన్ని నెలలుగా, వారు ఇజ్రాయెల్‌పై అనేక క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు చేశారు. ఇవి పాలస్తీనాకు సంఘీభావంగా జరిగాయి. వీటిలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలచే అడ్డుకోబడ్డాయి, మరికొన్ని చోట్ల నాశనమయ్యాయి, కానీ హౌతీలు తమ దాడులను మాత్రం కొనసాగించారు.
ఇజ్రాయెల్‌తో సంబంధం
ఈ వారం ప్రారంభంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు సనాలోని పలు ప్రాంతాలను తాకాయి. దీనిలో హౌతీ నియంత్రిత ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కనీసం 10 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘర్షణ ఎర్ర సముద్రంలోకి కూడా వ్యాపించింది. అక్కడ హౌతీలు ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నాయని చెప్పి వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు.
ఆపలేకపోయిన అమెరికా..
దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ హౌతీ నియంత్రిత ప్రాంతాలపై, సనా రాజధాని, ముఖ్యమైన హోడెయ్డా ఓడరేవు నగరంపై పదేపదే దాడులు చేసింది. మే నెలలో జరిగిన ఒక దాడిలో సనా విమానాశ్రయం ఉపయోగించలేని స్థితికి చేరింది. యునైటెడ్ స్టేట్స్ మే నెలలో హౌతీలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
దీని ప్రకారం హౌతీలు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు ఆపితే వైమానిక దాడులు నిలిపివేయబడతాయన్నారు. కానీ ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న లక్ష్యాలపై దాడులను ఈ ఒప్పందం పరిమితం చేయలేదని హౌతీలు పేర్కొన్నారు. అంటే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కూడా ఈ దాడులను ఆపలేకపోయింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి