Share News

Trump Gaza ceasefire: బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకారం.. గాజా యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన..

ABN , Publish Date - Oct 05 , 2025 | 10:18 AM

గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

Trump Gaza ceasefire: బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకారం.. గాజా యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన..
Trump Israel Gaza

గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పోస్ట్ చేశారు (Israel withdraw troops). ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనన ఇరుపక్షాలు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళిక తొలి దశలో భాగంగా గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ తాజాగా అంగీకరించినట్టు ట్రంప్ తెలిపారు (Trump Israel Gaza).


గాజా నుంచి బలగాల ఉపసంహరణ సమాచారాన్ని హమాస్‌కు కూడా పంపించామని, హమాస్‌ కూడా అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు (Trump peace plan Gaza). ఆ తర్వాత ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు, ఖైదీల అప్పగింత ప్రారంభమవుతుందన్నారు (Israel-Gaza conflict). ఆ తర్వాత బలగాలు ఉపసంహరణకు నిబంధనలు రూపొందిస్తామన్నారు. అయితే గాజా నుంచి బలగాల ఉపసంహరణ విషయమై ఇజ్రాయెల్ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు.


ఇవి కూడా చదవండి..

హమాస్‌ శాంతి ఒప్పందానికి సిద్ధమన్న ట్రంప్.. ఇంతలో మళ్లీ ఇజ్రాయెల్ దాడులు

హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2025 | 10:18 AM