PM Modi on Gaza deal: గాజా శాంతి ఒప్పందం.. అమెరికా అధ్యక్షుడికి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ..
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:00 PM
ఇజ్రాయెల్, హమాస్ మధ్య రాజీ కుదర్చి గాజా శాంతి ఒప్పందానికి నడుం బిగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గాజా శాంతి ప్రణాళిక మొదటి దశను స్వాగతించారు. గాజా ప్రాంతంలో శాశ్వత శాంతి వైపు ఇది తొలి అడుగు అని మోదీ అభివర్ణించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య రాజీ కుదర్చి గాజా శాంతి ఒప్పందానికి నడుం బిగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గాజా శాంతి ప్రణాళిక మొదటి దశను స్వాగతించారు. గాజా ప్రాంతంలో శాశ్వత శాంతి వైపు ఇది తొలి అడుగు అని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు (Trump Gaza agreement).
'అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళిక మొదటి దశ ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇది ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు బలమైన నాయకత్వానికి ప్రతిబింబం కూడా' అని మోదీ పేర్కొన్నారు (Israel Hamas news). గాజా ప్రజలకు మానవతా సహాయం చేయడంతో పాటు, బందీలను విడుదల చేయడం వల్ల వారికి ఉపశమనం లభిస్తుందని, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతికి పునాది పడుతుందని ప్రధానమంత్రి మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
బందీలను విడుదల చేయడానికి, దళాలను పాక్షికంగా ఉపసంహరించుకోవడానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే (Trump peace deal). గాజా శాంతి ప్రణాళిక మొదటి దశలో భాగంగా, ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తుందని, గాజా నుంచి ఇజ్రాయెల్ తన దళాలను ఉపసంహరించుకుంటుందని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు కారణంగా దాదాపు రెండేళ్లు గాజా అట్టుడికిపోయింది.
ఇవి కూడా చదవండి..
Israel Hamas deal: మొదటి దశ శాంతి ఒప్పందం.. సంతకం చేసిన ఇజ్రాయెల్, హమాస్
India vs Trump policy: ట్రంప్‌నకు షాక్.. తాలిబన్, పాకిస్థాన్, చైనా, రష్యాకు భారత్ మద్దతు..
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..