Share News

Gaza Peace Efforts: దిగివస్తున్న హమాస్‌.. ఇజ్రాయెల్‌ బందీల విడుదలకు అంగీకారం

ABN , Publish Date - Oct 04 , 2025 | 09:07 AM

ట్రంప్‌ హెచ్చరికలతో హమాస్ దిగివస్తోంది. ఇజ్రాయెల్‌ బందీల విడుదలకు అంగీకారం తెలిపింది. ఈ తాజా పరిణామంపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. గాజాలో ట్రంప్‌ చేస్తున్న శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని..

Gaza Peace Efforts:  దిగివస్తున్న హమాస్‌.. ఇజ్రాయెల్‌ బందీల విడుదలకు అంగీకారం
Gaza Peace Efforts

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ హెచ్చరికలతో హమాస్ దిగివస్తోంది. ఇజ్రాయెల్‌ బందీల విడుదలకు హమాస్‌ అంగీకారం తెలిపింది. ఈ తాజా పరిణామంపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు.

గాజాలో డోనాల్డ్ ట్రంప్‌ చేస్తున్న శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని మోదీ ఎక్స్ లో సందేశమిచ్చారు. ఇజ్రాయెల్‌ బందీల విడుదలకు హమాస్‌ అంగీకారం కీలక ముందడుగని ఆయన పేర్కొన్నారు. శాశ్వత శాంతి ప్రయత్నాలకు భారత్‌ మద్దతు ఉంటుందని ప్రధాని తన సందేశంలో వెల్లడించారు.



హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ సైనికులు త్వరలోనే ఇంటి ముఖం పడతారని, ఇది సంతోషకరమైన విషయమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. గాజాలో శాంతి స్థాపనకు తోడ్పడిన ప్రపంచ దేశాలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ లో ఒక ప్రకటన చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయ్‌ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది 

పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2025 | 10:02 AM