విచిత్రం, 1966లో తులం బంగారం కంటే తాజ్ హోటల్‌లో బస చేయడమే ఎక్కువ ఖరీదు..
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:02 PM
ముంబైకి గర్వకారణంగా భావించే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం 1966 నాటి తాజ్ హోటల్ బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడమే. ఆ హోటల్ బిల్లును తాజాగా ఒక యూజర్ రెడ్డిట్‌లో షేర్ చేశారు.
ముంబైకి గర్వకారణంగా భావించే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం 1966 నాటి తాజ్ హోటల్ బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడమే. ఆ హోటల్ బిల్లును తాజాగా ఒక యూజర్ రెడ్డిట్‌లో షేర్ చేశారు. 1966లో తాజ్ హోటల్‌లో ఒక రోజు బస మొత్తం ఖర్చు 150 రూపాయల కంటే తక్కువగా ఉన్నట్లు ఆ బిల్లు ద్వారా తెలుస్తోంది. నేడు అదే హోటల్‌లో ఒక రాత్రి అద్దె 34,000 రూపాయలకు మించి ఉంటుంది (vintage India luxury).
వైరల్ అవుతున్న ఆ బిల్లు ప్రకారం, జనవరి 10, 1966న, తాజ్ మహల్ ప్యాలెస్‌లో ఒక గది అద్దె రూ. 105. సర్వీస్, సిబ్బంది ఛార్జీగా రూ. 11.70 జోడించారు. మరికొన్ని అదనపు ఛార్జీలు జోడించడంతో, మొత్తం బిల్లు సుమారు రూ.127.70 అయింది. ఆ సమయంలో సాధారణ పద్ధతిగా ఉన్న రెవెన్యూ స్టాంప్డ్ రసీదును ఉపయోగించి చెల్లింపు జరిగింది. ఆసక్తికరంగా, 1966లో, 10 గ్రాముల బంగారం ధర దాదాపు 83 నుంచి 85 రూపాయల మధ్యలో ఉండేది. అంటే తాజ్ హోటల్‌లో ఒక రోజు బస 10 గ్రాముల బంగారం కంటే ఖరీదైనదిగా ఉండేదన్నమాట (1966 Taj Hotel cost).

ప్రస్తుతం తాజ్ హోటల్ ఒక రోజు బిల్లు రూ.34 వేల నుంచి 50 వేల మధ్యలో ఉంటుంది (Taj Mahal Palace Mumbai facts). తులం బంగారం మాత్రం రూ. 1.78 లక్షలకు చేరుకుంది. ఏదేమైనా ఈ బిల్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రూ.127కు ఇప్పుడు ఆ హోటల్‌లో టీ దొరకడం కూడా కష్టమని ఒకరు వ్యాఖ్యానించారు. 'ఈ పాత తాజ్ హోటల్ బిల్లు కేవలం రసీదు కాదు, మారుతున్న కాలం, ధరల కథ' అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో అమెరికా భయం.. ఒక డాలర్‌కు 15 లక్షల రియాల్స్..
స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..