ఇరాన్‌లో అమెరికా భయం.. ఒక డాలర్‌కు 15 లక్షల రియాల్స్..
ABN , Publish Date - Jan 28 , 2026 | 07:23 AM
ఒకవైపు అమెరికా దాడి చేస్తుందనే భయాలు, మరోవైపు ఆర్థికపరమైన ఆంక్షలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిణామాలతో పాటు అంతర్గత సంక్షోభం కూడా చల్లారడం లేదు. దీంతో ఇరాన్ కరెన్స్ మరోసారి పతనమైంది. డాలర్‌తో పోల్చుకుంటే సరికొత్త కనిష్టానికి దిగజారింది.
ఒకవైపు అమెరికా దాడి చేస్తుందనే భయాలు, మరోవైపు ఆర్థికపరమైన ఆంక్షలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిణామాలతో పాటు అంతర్గత సంక్షోభం కూడా చల్లారడం లేదు. దీంతో ఇరాన్ కరెన్సీ మరోసారి పతనమైంది. డాలర్‌తో పోల్చుకుంటే సరికొత్త కనిష్టానికి దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రియాల్ కరెన్సీ విలువ ఏకంగా 15 లక్షలకు పడిపోయింది. అంటే ఒక్క డాలర్‌కు 15 లక్షల రియాల్స్. ఇది చరిత్రలోనే అత్యంత కనిష్టం (Iran US tensions).
2015లో అమెరికా, ఇరాన్ అణు ఒప్పందం చేసుకున్నాయి. అప్పటికి ఒక డాలర్‌కు 32 వేల రియాల్స్ ఉండేవి. అప్పట్నుంచి క్రమంగా పతనమవుతున్న రియాల్.. ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత వేగంగా పడిపోతూ వస్తోంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఏ క్షణాన దాడి చేస్తోందో అనే భయం ఆ దేశంలో నెలకొంది. యూఎస్ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ పశ్చిమాసియాకు చేరుకుంది. అలాగే పలు ఫైటర్ జెట్లు, మిలిటరీ కార్గో విమానాలను కూడా పశ్చిమాసియాకు అమెరికా తరలించనున్నట్టు కథనాలు వస్తున్నాయి (Iranian rial record low).
అమెరికా దాడి చేస్తుందనే ఊహాగానాల నడుమ ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది (US Iran conflict). తమపై దాడి చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని అమెరికాను హెచ్చరిస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో బిల్‌బోర్డ్‌లు కనిపిస్తున్నాయి. అమెరికా దాడికి దిగితే తాము కూడా గట్టిగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ నాయకులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని పశ్చిమాసియాలో ఇతర దేశాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్‌లు ఇంత గట్టిగా ఉంటాయా..
చిలుకల మధ్యలో సీతాకోక చిలుక.. 15 సెకెన్లలో ఆ సీతాకోకచిలుకను కనిపెట్టండి..